Begin typing your search above and press return to search.

బాబు..టీడీపీ జాతకాన్ని తేల్చనున్న క్వాష్ పిటిషన్...!

సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ కొట్టేసే అపుడు సంగతేంటి అన్న చర్చ వస్తోంది. క్వాష్ పిటిషన్ తో చంద్రబాబు మూడు కోర్టులలో గత ముప్పయి రోజులుగా పోరాటం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 3:00 AM GMT
బాబు..టీడీపీ జాతకాన్ని తేల్చనున్న క్వాష్ పిటిషన్...!
X

సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ కొట్టేసే అపుడు సంగతేంటి అన్న చర్చ వస్తోంది. క్వాష్ పిటిషన్ తో చంద్రబాబు మూడు కోర్టులలో గత ముప్పయి రోజులుగా పోరాటం చేస్తున్నారు. బాబు పక్షాన దిగ్గజ లాయర్లు ఈ కేసుని వాదిస్తున్నారు. క్వాష్ పిటిషన్ని ఏసీబీ కోర్టు హై కోర్టు కొట్టేశాయి. ఇపుడు సుప్రీం కోర్టు మీద ఆశలు ఉన్నాయి. అసలు 17ఏ అంటే ఏంటి దానిని ఎలా చంద్రబాబుకు అప్లై చేయాలి అన్నదే చూడాల్సి ఉంది.

ఈ చట్ట సవరణ జరిగింది 17ఏ ఉపశమనం లభించినది 2018 జూలై తరువాత అంటే స్కిల్ స్కాం కేసు జరిగింది 2014 నుంచి 2015 మధ్యలో అని అంటున్నారు. దాంతో ఈ చట్ట సవరణ బాబుకు వర్తించదు అని సీఐడీ తరఫున లాయర్లు వాదిస్తున్నారు. అదే విధంగా చూస్తే ఈ కేసులో 2017లోనే ఈడీ, జీఎస్టీ, ఐటీ ఎంట్రీ ఇచ్చి దర్యాప్తు చేశాయి కాబట్టి ఈ కేసు నాడే విచారణలోకి వచ్చిందని కూడా చెబుతున్నారు.

ఇలా సీఐడీ తరఫున వాదనలు ఉంటే ఈ కేసుని 2021లోనే ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తూ వచ్చింది కాబట్టి చంద్రబాబు అరెస్ట్ ముందు గవర్నర్ కి సమాచారం ఇవ్వాలని అనుమతి తీసుకోవాలని ఆయన తరఫున లాయర్లు వాదిస్తున్నారు. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదిస్తే సీఐడీ తరఫున దిగ్గజ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. రెండు వైపుల నుంచి తమ వాదనలకు మద్దతుగా పాత తీర్పులు ఇతర రిఫరెన్సులను కూడా అత్యున్నత న్యాయ స్థానం ముందు ఉంచారు.

ఇక తీర్పు ఇవ్వాల్సింది న్యాయ స్థానం. ఒకవేళ క్వాష్ పిటిషన్ని సమర్ధిస్తూ తీర్పు వస్తే బాబు హాయిగా బయటకు వస్తారు. ఆయన మీద పెట్టిన కేసు అక్రమం అని చెప్పుకుంటారు. అలా కాకపోతే సంగతేంటి అన్నది కూడా చూడాలి. అపుడు కచ్చితంగా బాబు మరిన్నాళ్ళ పాటు జైలులోనే ఉండాల్సి వస్తుందని అంటున్నారు. ఇక బాబు మీద ఇప్పటికే ఫైబర్ నెట్ కేసు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసు కూడా ఉన్నాయని అంటున్నారు.

వీటితో పాటు మరో ఇరవై దాకా కేసులు పెట్టతగినవి ప్రాథమిక సాక్ష్యాధారాలతో ప్రభుత్వం వద్ద ఉన్నాయని అంటున్నారు. అంటే ఒక్క క్వాష్ పిటిషన్ కొట్టేస్తే బాబు పీకల్లోతు కష్టాలలోకి వెళ్లిపోతారని ప్రచారం సాగుతోంది. 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వంలో అనేక రకాలైన స్కాములు సాగాయని అవన్నీ బయటకు ఒక్కోటీ వెలికి తీస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక క్వాష్ పిటిషన్ కేవలం స్కిల్ స్కాం కోసం కాదు అని వెనక ఉన్న అనేకే కేసులు కొత్తగా ప్రభుత్వం పెట్టాలనుకున్న కేసుల కోసం అని అంటున్నారు. అందుకే బాబు రాజమండ్రి జైలులో నెల రోజులు దాటినా క్వాష్ పిటిషన్ ద్వారా తన మీద సీఐడీ పెట్టిన కేసుని కొట్టేయించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.

17ఏ బాబుకు వర్తిస్తుంది అని కోర్టు తీర్పు ఇస్తే బాబు ఇక పూర్తి స్థాయిలో జనంలోకి వచ్చి రాజకీయ దూకుడు చేయవచ్చు. అందుకోసమే ఇంత పట్టుదలగా క్వాష్ పిటిషన్ విషయంలో ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యం వెనక క్వాష్ పిటిషన్ ఉందని అంటున్నారు. మరి సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఒక వేళ అక్కడ ప్రతికూల తీర్పు వస్తే మాత్రం టీడీపీకి గడ్డు రోజులు దాపురించినట్లే అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫ్రైడే ఎలా ఉంటుందో మరి.