ఇది మాత్రం బాబుకు హాటే.. విషయం ఏంటంటే!
వీటిలో కీలకమైన ప్రాజెక్టు పోలవరం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 July 2024 8:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి, కూటమి సర్కారు సారథి చంద్రబాబు.. ఇప్పటి వరకు జగన్ పాలనలో జరిగిన లోపా లు.. నిర్లక్ష్యాలు.. దోపిడీల గురించి పేర్కొంటూ.. శ్వేత పత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
వీటిలో కీలకమైన ప్రాజెక్టు పోలవరం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు. త్వరలోనే చంద్రబాబు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు సహా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు శ్వేతపత్రం రూపొం దించే దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం శ్వేతపత్రాలకు.. ఆర్థిక శాఖ కు సంబంధించిన శ్వేత పత్రానికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. వాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయినా. మేనేజ్ చేయొచ్చు. కానీ, ఆర్థిక పరమైన విషయాలకు వచ్చే సరికి.. ఎవరి జమానా అయినా.. మూసి ఉంచిన గుప్పిటతో సమానం.
ఈ గుట్టు బయటకు విప్పేందుకు ఎవరూ సాహసించరు. ఎందుకంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బయట పడిపోతుంది. దీంతో పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జగన్ హయాంలో 10 లక్షల కోట్లు అప్పు చేశారని కొందరు వ్యాఖ్యానించారు. కాదు.. 7 లక్షల కోట్లని కొందరు చెబుతారు. కేంద్రం అయితే.. 4-6 లక్షల కోట్లేనని చెప్పింది. ఎన్నికలకు ముందు.. 20 లక్షల కోట్లని కొన్ని పార్టీలు చెబితే.. కాదు. 15 లక్షల కోట్ల వరకు ఉందన్నారు. దీనిపై క్లారిటీ లేదు.
ఇక, ఇప్పుడు దీనిని వెల్లడించాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి రూ.14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనినే శ్వేతపత్రం రూపంలో అధికా రికంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఇక్కడే ఆర్థిక నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నా రు. ఆర్థిక విషయాల గుట్టును విప్పితే.. ప్రమాదమని అంటున్నారు. పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రారని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.