Begin typing your search above and press return to search.

కరోనా తరహాలో ప్రాణాలు తీస్తోంది... అమెరికాలో ఏమిటీ భయంకర సమస్య?

అయితే... ఇదే తరహాలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను ఓ సమస్య పట్టి పీడిస్తోంది.

By:  Tupaki Desk   |   14 Nov 2024 8:30 PM GMT
కరోనా తరహాలో ప్రాణాలు తీస్తోంది... అమెరికాలో ఏమిటీ భయంకర సమస్య?
X

ప్రపంచం ఏమాత్రం మరిచిపోలేని మహమ్మారి కరోనా వైరస్ అనే సంగతి తెలిసిందే! ఈ సమస్య ప్రపంచాన్ని వణికించేసింది. దాదాపు చాలా దేశాల్లో రోజుకు వందకు తక్కువ కాకుండా మరణాలు సంభవించేవి! అయితే... ఇదే తరహాలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను ఓ సమస్య పట్టి పీడిస్తోంది. అదే.. ఓ సింథటిక్ డ్రగ్!

అవును... సరిగ్గా కరోనా మహమ్మారి తరహాలో రోజుకు వందల మంది ప్రాణాలు తీస్తూ అమెరికాను అంతర్లీనంగా నాశనం చేస్తోంది ఓ సింథటిక్ డ్రగ్. దీని దాటికి బలైపోతున్నవారిలో మెజారిటీగా యువత, మద్య వయస్కులవారే ఉన్నారని అంటున్నారు. అయితే... ఈ వ్యవహారంపై చైనాను అనుమానిస్తున్నారని చెబుతున్నారు.

ఇటీవల అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) షాకింగ్ గణాంకాలు విడుదల చేసింది. ఇదే సమయంలో... ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఈ అంశం ఒకటిగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

అమెరికాను వణికిస్తున్న ఆ డ్రగ్ పేరు "ఫెంటనిల్". ఇది ఒక పెయిన్ కిల్లర్. అయితే.. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై పని చేస్తుంది. హెరాయిన్ కంటే సుమారు 50 రెట్లు పవర్ ఫుల్ అని చెబుతున్నారు. దీన్ని రెండు మిల్లీ గ్రాముల డోసు కూడా ప్రాణాంతకమైనదని హెచ్చరిస్తున్నారు. దీన్ని మాదకద్రవ్యాలతో కలిపి వాడుతున్నారని అంటున్నారు!

మరికొంతమంది తప్పుడు ప్రిస్క్రిప్షన్స్ తో మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారని అంటున్నారు. ఇది మెక్సికోలోని క్రిమినల్ గ్యాంగ్స్ చేతిలో పడటం వల్ల ఈ స్థాయిలో విచ్చలవిడి అయిపోయిందని చెబుతున్నారు. చైనాలో దీన్ని చౌకగా తయారు చేసి వివిధ మార్గాల్లో అమెరికాకు తరలిస్తున్నారని చెబుతున్నారు.

వాస్తవానికి పెయిన్ కిల్లర్ గా ఉపయోగించే ఈ ఫెంటనిల్ ను ఆస్పత్రుల బయట వినియోగించేవారు కాదు. అయితే... ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా వాడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో దీనికి సంబంధించి ప్రతీ దశలోనూ చైనా హస్తం ఉందని అమెరికా అధికారులు బలంగా నమ్ముతున్నారు.

కాగా... అమెరికా సీడీసీ 2022లో ఫెంటనిల్ అధిక డోస్ కారణంగా 1,07,941 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అంటే.. సగటున రోజుకు 295 మంది దీని కారణంగా చనిపోతున్నారన్నమాట. ఇక ఈ సంఖ్య 2023లో 1,10,640 ఉండొచ్చని అంటున్నారు. అంటే.. సగటున రోజుకు 303 మంది చనిపోతున్నట్లు అన్నమాట.

ఈ సందర్భంగా స్పందించిన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్స్... గత రెండేళ్లలో సుమారు 50,000 పౌన్ల కంటే ఎక్కువ పెంటనిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అంటే... దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు తీయగలగినంతన్న్నమాట! ఈ విషయాలు సీబీపీ తాత్కాలిక చీఫ్ వెల్లడించారు. దీన్నిబట్టి ఈ సమస్య తీవ్రత అమెరికాకు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకొవచ్చని అంటున్నారు!