Begin typing your search above and press return to search.

సెల్ ఛార్జింగ్ పెడుతుంటే మంటలు.. నలుగురు చిన్నారులు మృత్యువాత

యూపీలోని మేరఠ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. కూలీ పని చేసుకొని జీవనం సాగించే జానీ - బబిత దంపతులకు నలుగురు సంతానం.

By:  Tupaki Desk   |   25 March 2024 6:31 AM GMT
సెల్ ఛార్జింగ్ పెడుతుంటే మంటలు.. నలుగురు చిన్నారులు మృత్యువాత
X

ఫోన్ ఛార్జింగ్ అని సింఫుల్ గా తీసుకోవద్దు. చిన్న తేడా వస్తే ప్రాణాలకే ముప్పు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీ ఫోన్ ఛార్జర్ లో లోపం ఉన్నా.. మీ ఛార్జర్ వైరు సరిగా లేకున్నా.. మీరు ఛార్జింగ్ కోసం పెట్టే హోల్డర్ లో తేడా ఉన్నా కూడా అది మీ ప్రాణాల్ని తీస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. తాజాగా అలాంటి ఘోర ఉదంతం ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే వేళలో చెలరేగిన మంటలు నలుగురు చిన్నారుల ప్రాణాల్ని తీసిన వైనం షాకింగ్ గా మారింది.

యూపీలోని మేరఠ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. కూలీ పని చేసుకొని జీవనం సాగించే జానీ - బబిత దంపతులకు నలుగురు సంతానం. వారి పేర్లు సారిక (10), నిహారిక (8), సంస్కార్ (6), కలు (4). ఎప్పటిలానే శనివారం రాత్రి సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. అనూహ్యంగా షార్టు సర్క్యుట్ చోటు చేసుకుంది. దీంతో మంటలు చెలరేగి దుప్పటికి అంటుకున్నాయి.

అయితే.. ఈ ప్రమాదం నుంచి జానీ తప్పించుకున్నారు. కానీ.. పిల్లలు మాత్రం మంటల ధాటి నుంచి తప్పించుకోలేకపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు ఇంట్లోనే మృత్యువాత పడగా.. పిల్లల తల్లి బబిత పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే క్రమంలో మంటలు చెలరేగి.. బెడ్ షీట్ కు అంటుకోవటంతో చూస్తుండగానే మంటలు మరింత పెరిగిపోవటంతో నలుగురు చిన్నారులు మరణించారు. బబిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు వైద్యులుచికిత్స చేస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా షాకింగ్ గా మారింది.