Begin typing your search above and press return to search.

సెల్‌ ఫోన్‌ కంటైనర్‌ చోరీ... రీల్ కాదు రియల్ ఇష్యూ!

సాధారణంగా సినిమాల్లో కనిపించే సన్నివేశం ఒకటి రియల్ గా జరిగింది. సినిమాల్లో కంటైనర్స్ ని దొంగిలించే సన్నివేశాలు క్రియేటివిటీగా ఉంటాయి.

By:  Tupaki Desk   |   16 Sep 2023 6:11 AM GMT
సెల్‌ ఫోన్‌ కంటైనర్‌ చోరీ... రీల్ కాదు రియల్ ఇష్యూ!
X

సాధారణంగా సినిమాల్లో కనిపించే సన్నివేశం ఒకటి రియల్ గా జరిగింది. సినిమాల్లో కంటైనర్స్ ని దొంగిలించే సన్నివేశాలు క్రియేటివిటీగా ఉంటాయి. అయితే తాజాగా అంతకు మించిన క్రియేటివిటీ చూపించారు ఇద్దరు డ్రైవర్లు. ఇందులో భాగంగా సెల్ ఫోన్ లు ఉన్న కంట్రైనర్ ను చోరీ చేశారు.

అవును... సెల్ ఫోన్స్ తో ఉన్న ఒక భారీ కంటైనర్ ను ఇద్దరు డ్రైవర్లు చాకచక్యంగా చోరీ చేశారు. అందులో ఉన్న సుమారు 1.3కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్ లను ఎత్తుకెళ్లారు. ఈ విషయం ఈ నెల 11 న జరగగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరి నిందితుల కోసం స్పెషల్ టీంస్ రంగంలోకి దిగి మరీ సెర్చ్ చేస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... ఈ నెల 11న సెల్‌ ఫోన్ల లోడుతో హరియాణా నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్‌ ను కర్నూల్‌ జిల్లా డోన్‌ జాతీయ రహదారిలోని ఓబులాపురం మిట్ట సమీపంలో ఆపాడు డ్రైవర్. అనంతరం మరో వాహనం వచ్చి ఆగింది. దీంతో ఈ కంటైనర్ లో ఉన్న సెల్ ఫోన్ లను ఇంకో మరో వాహనంలోకి మార్చారు. ఖాళీ అయిన కంటైనర్‌ ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు.

ఆ కంటైనర్ లో ఉన్న సెల్ ఫోన్ ల విలువ రూ.1.3కోట్లని తెలుస్తుంది. దీంతో విషయం తెలుసుకున్న నాగాలాండ్‌ కు చెందిన కంటైనర్‌ యజమాని డోన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న డోన్‌ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు.