Begin typing your search above and press return to search.

కేంద్రం ఫిట్టింగ్ : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాల్సిందే ?

అందులో కేంద్రం అమలు చేసే ప్రతీ సంస్కరణనూ రాష్ట్రాలు అమలు చేయాలని కోరడం ముఖ్యమైనదిగా ఉంది.

By:  Tupaki Desk   |   25 July 2024 3:31 AM GMT
కేంద్రం ఫిట్టింగ్ : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాల్సిందే ?
X

కేంద్ర బడ్జెట్ లో కీలక విషయాలు ఒక్కొక్కటి ఇపుడు వెలుగు చూస్తున్నాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగంలో అనేక అంశాలు ఉన్నాయి. అందులో కేంద్రం అమలు చేసే ప్రతీ సంస్కరణనూ రాష్ట్రాలు అమలు చేయాలని కోరడం ముఖ్యమైనదిగా ఉంది.

ఫెడలర్ సెటప్ లో అంతా ఒక్కటిగా ముందుకు సాగాలీ అంటే ఇదే సరైన విధానం అని కేంద్రం భావిస్తోంది. ఇక యాభై ఏళ్ల పాటు వడ్డీలేని రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాల్సిందే అన్నది కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని సారాంశంగా చెబుతున్నారు.

ఈ చట్టాన్ని అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే యాభై ఏళ్లు వడ్డీ లేని రుణాలు ఇస్తామని స్పష్టంగా కేంద్ర ఆర్ధిక మంత్రి చెప్పారు. పోటీతత్వంతో కూడిన ఫెడలరిజంలో రాష్ట్రాలకు మేలు జరిగేలా చూసేందుకే సంస్కరణలుగా కేంద్ర మంత్రి చెప్పారు.

యాభై ఏళ్ల పాటు వడ్డీలు లేని రుణాలు కావాలంటే కేంద్రం చేసే సంస్కరణలను అనుసరించాల్సిందే అని పేర్కొన్నారు. ఈ క్రమంలో భూ సంబంధిత సంస్కరణలు చర్యలు తప్పనిసరిగా చేపట్టాల్సిందే అని కేంద్రం రాష్ట్రాలను కోరుతోంది.

అర్బన్ రూరల్ ఏరియాలు మొత్తం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో సంస్కరణలు ఉండాల్సిందే అని పేర్కొంది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ని కచ్చితంగా అమలు చేయాలని కోరింది. గ్రామీణ ప్రాంతాలలో భూముల వివరాలు సేకరించి వాటికి ఒక యూనిక్ నంబర్ ని ఇవ్వడం అంటే భూ ఆధార్ అన్న మాట. అన్ని భూములకి ఇది తప్పనిసరి అని పేర్కొంది.

అలాగే భూములకు సంబంధించిన మ్యాపులన్నీ డిజిటలైజ్ చేయాలని కూడా కేంద్రం కోరుతోంది. సబ్ డివిజన్ల వారీగా సర్వే చేపట్టాలని కూడా పేర్కొంది. ప్రస్తుతం ఎవరికి భూ యాజమాన్య హక్కులు ఉన్నాయో వాటిని నిర్ధారిస్తూ ఈ సర్వే ఉండాలని పేర్కొంది. అలాగే అర్బన్ ఏరియాలలో సైతం భూములకు సంబంధించిన రికార్డులను డిజిటలైజ్ చేయాలని పేర్కొంది.జీఐఎస్ మ్యాపింగ్ కూడా చేయాలని సూచించింది.

మొత్తంగా చెప్పేదేంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయమనే అని అంటున్నారు. అందులో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ అసెంబ్లీలో ఆమోదించింది. మరి కేంద్రంలో ప్రభుత్వం భూ సంస్కరణల మీద కచ్చితమైన వైఖరితో ఉంటోంది. ప్రతీ భూమినీ సర్వే చేసి పక్కాగా డిజిటలైజేషన్ చేయమని చెబుతోంది. లేకపోతే వడ్డీ లేని రుణాలు రావని అంటోంది.

ఈ విషయంలో ఏపీలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది చూడాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం వైసీపీకి చెందిన కార్యకర్తలు ఎన్నికల్లో ఓట్ల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విష ప్రచారం చేశారని విమర్శిస్తున్నారు.

ఇపుడు కేంద్రమే భూ సంస్కరణలు చేయాలని యాక్ట్ గురించి చెబుతోంది. ఏపీ ప్రజలకు చంద్రబాబు మంచి చేశారా లేక చెడ్డ చేశారా అన్నది తెలుసుకోమంటున్నారు. మరి రానున్న రోజులలో వైసీపీ ఏ విధంగా దీని మీద రాజకీయ రచ్చ చేస్తుందో కూటమి ఎలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుని సమర్ధించుకుంటుందో చూడాల్సి ఉంది.