పోలవరం పైన కేంద్రం సపోర్టు ఎంతవరకు ?
అంతే కాదు 2013 చట్టం ప్రకారం భూసేకరణకు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. ఎంత ఎత్తు దాకా కడతారు
By: Tupaki Desk | 24 July 2024 12:30 AM GMTపోలవరం విషయంలో ఇప్పటికీ ఒక అస్పష్టత కొనసాగుతోంది. దీని మీద ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆర్ధిక మంత్రి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని అంటూనే దానిని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి నిర్మాణం చేస్తోందని అన్నారు. ఇది ఒక ఒప్పందం అని చెప్పారు.
ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి అయ్యే ఖర్చుని కేబినెట్ ఆమోదించిందని దాని ప్రకారం ఇవ్వాల్సింది అంతా దాదాపుగా ఇప్పటికే ఇచ్చేసామని అన్నారు. అయితే ఇపుడు కొత్త సమస్యలు వస్తున్నాయని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అన్న దాని జోలికి పోవడం లేదని అన్నారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ అంటే నిర్వాసితులకు ఎంత మేరకు చెల్లింపులు చేయాలి ఎన్ని గ్రామాలు తరలించాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని అన్నారు.
అంతే కాదు 2013 చట్టం ప్రకారం భూసేకరణకు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. ఎంత ఎత్తు దాకా కడతారు. ఎన్ని గ్రామాలు తరలించాలి అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇవన్నీ 2014 నాటికే ఒప్పుకుని కేబినెట్ దానికే అనుమతి ఇచ్చిందని అన్నారు.
ఇప్పటివరకూ ఒప్పుకున్న అన్ని కండిషనల్స్ కి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకూ ఒప్పుకుందో దాని ప్రకారం చెల్లిస్తాం, ఇక కొత్త ఇష్యూస్ వచ్చినా ఎంత ఖర్చు అవుతుందో కూడా చూస్తామని అన్నారు. కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని ప్రకారమే దాదాపుగా క్లియర్ చేశామని కేంద్ర మంత్రి చెప్పారు.
ఇప్పటి నుంచి ఎంత ఎత్తుకు ఒప్పుకున్నారో దానిలో ఉన్న ఇబ్బందులు దాటుకుని దానిని పూర్తి చేయడానికి ఎంత అవుతుందో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి సపోర్ట్ ఇస్తామని కంద్ర మంత్రి చెప్పారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో 2014 నాటి అంచనాలను అప్పట్లో కేబినెట్ ఆమోదించింది. దాని ప్రకారం చూస్తే తక్కువ మొత్తమే ఖర్చు అవుతుంది.
కానీ 2018 తరువాత సవరించిన అంచనాలు చూస్తే ఆ మొత్తం 56 వేల కోట్లకు చేరుకుంది. ఇందులో పునరావాస ప్యాకేజీ కూడా ఉంది. ఈ విధంగా చూస్తే టీడీపీ అప్పటి ప్రభుత్వంలో కానీ ఆ తరువాత అయిదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కానీ పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్ ఆమోదించలేదు అన్న ప్రచారం ఉంది.
ఇక కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం అంచనాలు ఇంకా పెరిగాయని చెబుతున్నారు. అంటే ఇది కాస్తా ఏ డెబ్బై వేల కోట్ల రూపాయలకో చేరుకోవచ్చు అని అంటున్నారు. మరి కేంద్రం ఆమోదించినది 2014 అంచనాలనే, ఆ తరువాత 2018లో సవరించిన అంచనాలు ఉన్నాయి. ఇపుడు కొత్తగా అంచనాలు మారితే వాటిని కూడా ఆమోదిస్తారా ఎంత చెల్లించాలో చూసి మాట్లాడి సపోర్టు ఇస్తామని కేంద్ర మంత్రి అంటున్నారు. ఆ సపోర్టు ఎంత వరకు ఇస్తారు ఏ అంచనాలకు ఇస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదనే అంటున్నారు.
మరి దీని మీద చంద్రబాబు కూడా పోలవరానికి నిధులు ఎంత అని కేంద్రం చెప్పలేదని దాన్ని పూర్తి చేసే బాధ్యత తమదే అని చెప్పిందని మీడియాకు వివరించారు. అంటే పోలవరం విషయంలో పూర్తి స్పష్టత అయితే రావాల్సి ఉంది అని అంటున్నారు.