Begin typing your search above and press return to search.

కేంద్ర బడ్జెట్ లో ఏపీ పంట పండనుందా ?

ఇక ఆ తరువాత ఏపీకి కూడా ఎక్కువగానే నిధులు దక్కుతాయని అంటున్నారు. ఏపీలో అమరావతి పోలవరం ఈ రెండు భారీ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం ఫోకస్డ్ గా చేసి పెట్టుకుంది.

By:  Tupaki Desk   |   18 Jan 2025 3:45 AM GMT
కేంద్ర బడ్జెట్ లో ఏపీ పంట పండనుందా ?
X

కేంద్రంలోని నరేంద్ర మోడీ ఏపీ మీద ప్రేమను భారీగా కురిపిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అగ్ర తాంబూలమే అని ఢిల్లీ వర్గాల భోగట్టాగా ఉంది. లేటెస్ట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించిన నరేంద్ర మోడీ 2025-26 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లో కేంద్రం ఏపీకి బీహార్ కి పెద్ద పీట వేస్తుందని వార్తలు వస్తున్నాయి.

అంతే కాదు ఎన్డీయే రాష్ట్రాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం సాగుతోంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో ఇరవై దాకా ఎన్డీయే రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు సగం దాకా ఉన్నాయి. ఇలా బడ్జెట్ లో అధిక ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటే బీజేపీ రాష్ట్రాలు ఎన్డీయే రాష్ట్రాలకే ఎక్కువ కేటాయింపులు జరుపుతారని అంటున్నారు.

అదే సమయంలో బీహార్ కి ప్రత్యేక ఆర్ధిక సాయమే దక్కుతుందని అంటున్నారు. ఎందుకంటే బీహార్ లో ఈ ఏడాది అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో బీహార్ కి చాలా కీలకమైన హామీలు నెరవేర్చేందుకు తగిన ఆర్ధిక సాయం అందిస్తారు అని అంటున్నారు.

ఇక ఆ తరువాత ఏపీకి కూడా ఎక్కువగానే నిధులు దక్కుతాయని అంటున్నారు. ఏపీలో అమరావతి పోలవరం ఈ రెండు భారీ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం ఫోకస్డ్ గా చేసి పెట్టుకుంది. దాంతో వీటికి కేంద్రం ఇచ్చే ఆర్ధిక సాయం ఏమిటి అన్నది కూడా ఈ బడ్జెట్ లో తెలుస్తుంది అని అంటున్నారు.

అదే విధంగా విభజన హామీల గురించి ఏమైనా ప్రస్తావన బడ్జెట్ లో ఉంటుందా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్ సమావేశాలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి మొదటి దశ బడ్జెట్ సమావేశాలు గా కేంద్రం పేర్కొంటోంది.

ఈ సమావేశాలు ఫిబ్రవరి 13 దాకా సాగుతాయి. తిరిగి రెండవ విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10వ తేదీ నుంచి మొదలై ఏప్రిల్ 4 వరకూ జరుగుతాయి. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాలు పెద్దగా చర్చ లేకుండానే ముగిసాయి. దాంతో బడ్జెట్ సమావేశాలు సాఫీగా జరపాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది.

వీలైతే కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలని చూస్తోంది. మరి ఈసారి విపక్షాలు ఏ అంశాలను ఎంచుకుని సభ ముందుకు వస్తాయో చూడాల్సి ఉంది. అంతే కాదు కేంద్ర బడ్జెట్ లో ఏమైనా వివక్ష అంటూ జరిగితే అది కూడా రాజకీయ రాద్ధాంతంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు.