ఎన్నికల కమిషన్ చేతులెత్తేసిందా ?
సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోకే కేంద్ర ఎన్నికల కమీషన్ తాజాగా ఒక ప్రకటన విడుదలచేసింది.
By: Tupaki Desk | 22 Sep 2023 4:42 AM GMTఒకవైపు ఎన్నికల్లో దొంగఓట్ల ప్రభావం పెరిగిపోతోందని అన్ని పార్టీలు గోల చేస్తున్నాయి. ఇదే సమయంలో ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానిస్తే దొంగ ఓట్లకు ఫులిస్టాప్ పడుతుందనే సూచనలు పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని తాము కూడా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ అనేక సందర్భాల్లో ప్రకటించింది. ఎన్నికల్లో దొంగఓట్లు వేసుకునే పార్టీలు కూడా ఓటరుకార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించాల్సిందే అని నీతులు చెబుతోంది. సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోకే కేంద్ర ఎన్నికల కమీషన్ తాజాగా ఒక ప్రకటన విడుదలచేసింది.
అదేమిటంటే ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించటం తప్పనిసరికాదట. నిజానికి ఇప్పుడు కూడా ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం అన్నది కంపల్సరీ కాదు. అయితే ఆన్ లైన్ లో ఓటుకు దరఖాస్తు చేసుకునేటపుడు ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాల్సిందే. ఆధార్ కార్డు నెంబర్ ఇస్తేనే మిగిలిన ప్రాసెస్ ముందుకు వెళుతుంది.
అయితే ఈ కంపల్సరీ తద్దినాన్ని మార్చబోతున్నట్లు కమీషన్ ప్రకటించింది. అదేమిటంటే ఆన్ లైన్లో ఓటును రెన్యువల్ చేసుకునేటపుడు, లేదా దరఖాస్తు చేసుకునేటపుడు కచ్చితంగా ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఫారం లో మార్పులు చేస్తుందట.
ఓటరు దరఖాస్తు ఆన్ లైన్ ఫారంలో ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వటాన్ని ఆప్షనల్ అని మాత్రమే మార్చబోతోందట. దాని వల్ల ఆధార్ కార్డు ఇవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోయినా పర్వాలేదు పారంలోని ప్రాసెస్ ముందుకు వెళిపోతుంది. ఇక్కడే కమీషన్ వైఖరిపైన అనుమానాలు పెరిగిపోతున్నాయి. దొంగ ఓట్లను నియంత్రించేందుకు ఓటరుకార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయమని అందరూ డిమాండ్లు చేస్తుంటే కమీషన్ మాత్రం ఓన్లీ ఆప్షనల్ అని చెప్పటంలో అర్ధమేంటి ?
ఎన్నికల్లో ఓటు వేయటం ఎంత అవసరమో ఓటరుకార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించటమూ అంతే అవసరమని కేంద్ర ఎన్నికల కమీషన్ బల్లగుద్ది చెప్పాలి. అలా చెప్పాల్సిన కమీషనే ఓటరుకార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించాల్సిన అవసరం లేదని చెప్పిందంటే దీనివెనుక కచ్చితంగా బీజేపీ నే ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండుకార్డులను ఒకదానికి మరొకటి అనుసంధానిస్తే దొంగఓట్లు వేసుకోవటం చాలావరకు తగ్గిపోతుంది. దొంగఓట్లు వేసుకునేందుకు ఏదో ఉపాయం తెలుసుకునేంతవరకు ఒకటి రెండు ఎన్నికల్లో అయినా దొంగఓట్లు తగ్గిపోతాయి. మరీ విషయం కేంద్ర ఎన్నికల కమీషన్ కు తెలీదా ?