ఈసారి ఏపీలో ఎన్నికలు లేట్...!?
దేశంలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. వాటితో పాటు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలకు గడువు ముగుస్తోంది
By: Tupaki Desk | 21 Feb 2024 3:49 PM GMTఏపీలో ఎన్నికలు ఈసారి లేట్ అవుతాయా. అవి అటూ ఇటూ తిరిగి ఏకంగా ఏప్రిల్ నెలాఖరు దాకా వెళ్లే చాన్స్ ఉందా అంటే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాల బట్టి చూడాలని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ లో తెలంగాణా ఎన్నికలు ముగియడంతో ఏపీ మీద పూర్తి ఫోకస్ పెట్టేసింది. అంటే మూడు నెలలుగా ఏపీ మీదనే వర్క్ చేస్తోంది.
దేశంలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. వాటితో పాటు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలకు గడువు ముగుస్తోంది. అలా చూసుకుంటే ఆ స్టేట్స్ జాబితాలో ఏపీలో ఉంది. ఏపీ ఒడిషా, సిక్కిం అరుణాచల ప్రదేశ్ లకు ఎన్నికలు తధ్యం. అక్కడ అసెంబ్లీల కాల పరిమితి మరికొద్ది నెలలలోగా ముగుస్తోంది.
దాంతో కొత్త అసెంబ్లీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నాలుగు అసెంబ్లీలతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ కి కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది అని అంటున్నారు. దాంతో వచ్చే నెల మూడవ వారంలో అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది అని అంటున్నారు.
జమ్మూ కాశ్మీర్ కి కూడా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే అపుడు షెడ్యూల్ రావడం కొంత ఆలస్యం అవుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న దానిని బట్టి చూస్తే మార్చి 9 తరువాత ఏ క్షణంలో అయినా ఈసీ ఏపీకి సంబంధించి అసెంబ్లీకి అలాగే లోక్ సభకు దశలవారీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది అని అంటున్నారు
అదే జరిగితే గతంలో మాదిరిగా నెల రోజుల వ్యవధిలో అంటే ఏప్రిల్ 10 లోగా ఏపీలో ఎన్నికలు మొత్తం ముగుస్తాయి. కానీ అలా జరుగుతుందా అన్నదే ఇపుడు చర్చ. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కొంత ఆలస్యం అయితే ఎన్నికలు ఏకంగా ఏప్రిల్ నెలాఖరుకు పోవచ్చు అని అంటున్నారు.
అంటే ఏకంగా పదిహేను నుంచి ఇరవై రోజుల దూరం అన్న మాట. అదే జరిగితే ఏపీలో రాజకీయ లాభాలు నష్టాలు కూడా మారిపోతాయని అంటున్నారు. ఈ రోజుకు చూస్తే ఏపీలో అధికార వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నా కూడా విపక్షంతో ఢీ కొట్టే స్థాయిలో ఉంది. గెలుపు అవకాశాలు ఇంకా అలాగే ఉన్నాయి. కానీ ఏపీలో ఎన్నికలు లేట్ అయితే మాత్రం టీడీపీ జనసేన బీజేపీ కూటమి సర్దుకుని పూర్తి స్థాయిలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు.
ఏపీలో ఎన్నికలు లేట్ అవడం విపక్షాలకే లాభం అని అంటున్నారు. అధికార పక్షానికి ఎంత తొందరగా ఎన్నికలు జరిగితే అంత అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటున్నారు. లేట్ అయిన కొద్దీ ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది అని అంటున్నారు. ఇక ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. తాగు నీటి సమస్యతో పాటు విద్యుత్ సమస్యలు అన్నీ కూడా అదనంగా తోడు అవుతాయి.
అదే ఏప్రిల్ 10లోగా ఎన్నికలు అయితే ఈ సమస్యలు ఇంకా పెరగవు. అదే విధంగా విపక్షాలు ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఉన్నాయి. అవి పూర్తిగా రెడీ అయి ఎన్నికల క్షేత్రంలోకి వచ్చేలోగానే ఎన్నికలు జరిగితే విపక్ష కూటమిలో అసంతృప్తులు పెరిగి కొంత ఇబ్బంది అవుతుంది. అది అధికార పక్షానికి మేలు చేసే పరిణామంగా ఉంటుంది. అలా కాకుండా లేట్ అయితే విపక్షాలు మరింతగా పటిష్టం అవుతాయని అంటున్నారు.
మరి ఏపీలో 2019 మాదిరిగా ఏప్రిల్ 11లోగా ఎన్నికలు జరుగుతాయా అన్నది ఇపుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఇక ఈ ఆలోచనల నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెలగపూడి సచివాలయంలో సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్- స్వీప్ విభాగం డైరెక్టర్ సంతోష్ అజ్మీరా, ఇతర అధికారులు నోడల్ అధికారులతో సమీక్షను నిర్వహించారు. అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
మరి ఈ సమీక్షల తరువాత స్థూలంగా ఒక నిర్ణయానికి ఈసీ వస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఎపుడూ తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతాయి. దాంతో ఈసారి కూడా అలాగే జరుగుతాని అధికార పార్టీ అయితే ధీమాగా ఉంది అని అంటున్నారు.