నాడు వలంటీర్లు.. నేడు కలెక్టర్లు.. కష్టమే.. !
గత ఎన్నికల్లో వైసీపీకి చేటు చేసింది. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా.. నాయకులు, ప్రజలతో మమేకమయ్యే పరిస్థితిని తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తొలినాళ్లలో చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 11 Feb 2025 9:30 AM GMTపాలన కేంద్రీకృతం కాకూడదన్నది.. గతంలో వైసీపీ చేసిన ప్రయత్నం. కానీ, అది ఫలించలేదు. మంత్రులు, నాయకులు అందరూ డమ్మీలయ్యారు. కేవలం వలంటీర్లే సర్కారు పెద్దలుగా.. సర్కారు దూతలు గా రాజ్యం చేశారు. ఫలితంగా.. వైసీపీ కొట్టుకుపోయింది. ప్రజలకు-నాయకులకు ఉండాల్సిన సున్నిత బంధం.. అనుబంధం రెండూ వీగిపోయాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో(నారాయణస్వామి సహాపలువు రు) ఎమ్మెల్యేలు.. ప్రజలను పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది .. గత ఎన్నికల్లో వైసీపీకి చేటు చేసింది. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా.. నాయకులు, ప్రజలతో మమేకమయ్యే పరిస్థితిని తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తొలినాళ్లలో చెప్పుకొచ్చారు. కానీ, ఆయన మాటలు.. కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి. నాడు వలంటీర్లు చక్రం తిప్పితే.. ఇప్పుడు జిల్లాల్లో కలెక్టర్లు చక్రం తిప్పుతున్నారు. అన్నీ తామై కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రారంభోత్సవాల నుంచి రిబ్బన్ కటింగుల వరకు అన్నీ కలెక్టర్ల చెప్పు చేతల్లోకి వెళ్లిపోయాయి.
అంతేకాదు.. సవిత వంటి మహిళా మంత్రులను కూడా కలెక్టర్లు తప్పుదోవ పట్టిస్తున్న ఉదంతాలు తెరమీదికి వస్తున్నాయి. ఇక, హోం శాఖలో ఏం జరుగుతోందో.. మంత్రి అనితకు తెలియడం లేదంటే.. అతి కాదు... నిజం. ఆమె రోజూ ఉదయాన్నే ఫోన్లు చేసినా.. ఒకరిద్దరు స్పందిస్తున్నారు తప్ప.. మిగిలిన వారు స్పందించడం లేదు. దీనికి కారణాలు ఏంటనేది అందరికీ తెలిసిందే. పాలన కేంద్రీకృతం అయింది. కేవలం `ముగ్గురు` మాత్రమే పాలనను శాసిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యవహారం పార్టీల్లోనూ.. మంత్రుల మధ్య కూడా చర్చకు వస్తోంది. అయితే.. కలెక్టర్ల కారణంగా.. పాలన సజావుగా సాగుతుందని భావిస్తున్న ముఖ్యమంత్రి.. వారిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోం ది. కానీ, దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు కలెక్టర్లు.. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభావం మంత్రులకు ఇబ్బందిగా మారిందనేది వాస్తవం. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి.. చర్యలు తీసుకోవాలన్నది మంత్రుల విన్నపం. మరి ఏం చేస్తారో చూడాలి.