Begin typing your search above and press return to search.

మణిపూర్ వీడియో పై సీబీఐ ఎంక్వైరీ... తెరపైకి కొత్త రిక్వస్ట్!

కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది పోస్ట్ అయిన వీడియో పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

By:  Tupaki Desk   |   27 July 2023 3:27 PM GMT
మణిపూర్  వీడియో పై  సీబీఐ ఎంక్వైరీ... తెరపైకి  కొత్త  రిక్వస్ట్!
X

గత రెండున్నర నెలలుగా మణిపూర్ రాష్ట్రం అట్టుడికిపోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రాష్ట్రం లో ప్రశాంతత కనుమరుగైన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళల ను నగ్నంగా ఊరేగిస్తూ.. వారిలో ఒకరి పై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన కథనాలు, విడుదలయిన వీడియోలు... డబుల్ ఇంజిన్ సర్కారులుగా చెప్పుకునే బీజేపీ రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలను షేక్ చేసేసిందన్నా అతిశయోక్తి కాదేమో అనే కామెంట్లు విపరీతంగా వినిపించాయి!

అటు పార్లమెంటు లో కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేసేశాయి. ఈ సమయంలో ఈ విషయం పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో.. పార్లమెంటు కు మోడీ గౌర్హాజరవ్వడం ఈ సమస్య తీవ్రత ను తెలియజేస్తుందని అంటున్నారు పరిశీలకులు.

దీంతో... పరిస్థితిని ఏదోలా కూల్ చేయాలనో.. లేక, విపక్షాల కు ఈ రకంగా సమాధానం చెప్పాలనో తెలియదు కానీ... కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది! అందులో భాగంగా... ఇద్దరు మహిళల ను నగ్నంగా ఊరేగించినట్లు సోషల్ మీడియా లో పోస్ట్ అయిన వీడియో పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇదే సమయం లో ఈ వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వ్యక్తుల ను కూడా అరెస్ట్ చేయాలని సూచించింది.

మరోపక్క మణిపూర్ మహిళల వైరల్ వీడియో చిత్రీకరించిన మొబైల్ ఫోన్‌ ను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. దీన్ని చిత్రీకరించిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఇదే సమయం లో ఈ వ్యవహారం లో సీబీఐ ఎంక్వైరీ పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ కూడా దాఖలు చేయనుంది.

కాగా... ఈ దారుణ ఘటన కు ప్రధాన కారకుడైనట్లు వీడియో లో కనిపిస్తోన్న హుయిరెమ్ హెరోదాస్ మెయితీ అనే వ్యక్తితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే సమయం లో కేసు విచారణను మణిపూర్ వెలుపల జరపాల ని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది!

అయితే.. కాలగర్భంలో కలిసిపోయినట్లుగా సాగుతోన్నాయన్న కామెంట్ సంపాదించుకొన్న చాలా సీబీఐ కేసుల్లాగానే ఈ కేసు కూడా మారకూడదని.. వీలైనంత త్వరగా ఈ కేసు ఒక కొలిక్కి రావాలని.. పార్టీల కు, కులాల కు అతీతంగా అసలైన నిందితుల ను ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించాల ని ప్రజలు కోరుకుంటున్నారని తెలుస్తోంది!