Begin typing your search above and press return to search.

90 శాతానికి పైగా ఉద్యోగులపై ఒకేసారి షాక్... ఏమి జరిగింది?

అవును... అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Nov 2024 11:30 AM GMT
90 శాతానికి పైగా ఉద్యోగులపై ఒకేసారి షాక్... ఏమి  జరిగింది?
X

శాలరీ ఇచ్చే వారిపై సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతారు అని అంటారు. ఇదే సమయంలో.. శాలరీ ఇచ్చే సంస్థ సీఈవోకి ఆగ్రహం వచ్చినా ఉద్యోగానికి ఎసరు వచ్చేస్తుంది! ఈ సమయంలో తాను నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని ఆగ్రహించిన ఓ సంస్థ సీఈఓ ఒకేసారి 99 మందిపై వేటు వేశారు. ఆ సంస్థలో మొత్తం 111 మంది విధులు నిర్వహిస్తున్నారు.

అవును... అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తాను నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని ఆగ్రహించి 111 మంది విధులు నిర్వహిస్తోన్న తన సంస్థలో ఏకంగా ఒకేసారి 99 మందిపై వేటు వేశారు. ఆ సంస్థలో పనిచేస్తోన్న ఓ ఇంటర్న్ పెట్టిన పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆన్ లైన్ వేదికగా ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం... సదరు మ్యూజిక్ కంపెనీ సీఈఓ బాల్డ్విన్ ఆగ్రహానికి గల కారణాన్ని స్పష్టం చెప్పారంట. అగ్రిమెంట్ ప్రకారం... ఉద్యోగులు చేయాల్సిన పనులు పూర్తిచేయడంతో పాటు సమావేశాలకూ హాజరు కావడంలో విఫలమయ్యారని.. అందువల్లే స్టాఫ్ తో ఉన్న అగ్రిమెంట్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు!

ఈ సందర్భంగా మీ వద్ద ఉన్న సంస్థ వస్తువులను వెనక్కి ఇచ్చేయాలని.. అన్ని ఖాతాలను సైన్ ఔట్ చేయాలని సూచించారు. వాస్తవానికి మీ జీవితాలను మెరుగు పరుచుకోవడానికి వచ్చిన అవకాశం తన వద్ద దొరికిన ఉద్యోగం.. కానీ దీన్ని వీరు చేజార్చుకున్నారు అని ఉద్యోగులతో సదరు సీఇఓ స్పష్టం చేశారని అంటున్నారు.

మరోపక్క సీఈఓ తీరుపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... జాబ్ కోల్పోయిన వారు స్పందిస్తూ.. మీటింగ్ గురించి సరిగా సమాచారం అందలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క... సమాచారం సరిగ్గా అంది ఉంటే.. ఏకంగా ఒకేసారి 99 మంది హాజరుకాకుండా ఉంటారా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు మరో నెటిజన్!

ఇదే సమయంలో... ఒకేసారి 90శాతం ఎప్లాయిస్ ని తీసేశారంటే.. కచ్చితంగా మీటింగ్ కి గైర్హాజరవ్వడం కారణం కాకపోవచ్చని.. మరేదైనా కారణం, ఆర్ధిక పరమైన కారణం అయ్యి ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.