Begin typing your search above and press return to search.

తెలంగాణలో మీసాన్ని కొరిగెయ్యండి... ప్రొఫెసర్ చక్రపాణి సూచన!

ఈ నిర్ణయం సహేతుకమని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే.. మూర్ఖత్వం అని బీఆరెస్స్ నేతలు ఫైరవుతున్న పరిస్థితి!

By:  Tupaki Desk   |   30 May 2024 3:27 PM GMT
తెలంగాణలో మీసాన్ని కొరిగెయ్యండి... ప్రొఫెసర్  చక్రపాణి సూచన!
X

తెలంగాణ చిహ్నాన్ని మార్చడం అనే అంశం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సహేతుకమని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే.. మూర్ఖత్వం అని బీఆరెస్స్ నేతలు ఫైరవుతున్న పరిస్థితి!

ఈ సమయంలో చిహ్నంపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుందని అంటున్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్ర గీతంపై ఒక కన్ క్లూజన్ కి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో తెలంగాణ చిహ్నాన్ని మార్చడంపై ప్రముఖ విశ్లేషకులు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదని.. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు మాత్రమే గుర్తొస్తాయని చెప్పారు. ఈ క్రమంలోనే త్యాగాలు, పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని తెలిపారు.

ఈ సమయంలో రాచరిక ఆనవాళ్లు అనే కారణంతోనో ఏమో కానీ... తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ గుర్తులను తొలగించే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం వివాదస్పదంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

"రాచరికపు పోకడలు, ఫ్యూడల్ అవశేషాలు సమూలంగా తొలగించే చర్యలు ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలి. ముందుగా ఫ్యూడల్ ప్రతీకలుగా.. పేర్లలో ఉన్న కుల ఆనవాళ్లు తొలగించాలి. తొలగించుకోవాలి. ద్రవిడ ఉద్యమం ఇలాంటి ప్రతీకలు తెచ్చింది. పేరుకు ముందుండే వారసత్వపు ఇంటిపేరు, చివర ఉండే ఆదిపత్యపు కులం పేర్లను తొలగించింది" అని అన్నారు.

ఇదే సమయంలో... "మీసం రాచరికపు అవశేషం, పౌరుషం ఫ్యూడలిజపు ప్రతిరూపం! కొరిగెయ్యండి!" అంటూ మరో సంచలన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.