చలో తాడేపల్లి.. వైసీపీ సెకండ్ లిస్ట్ కి కౌంట్ డౌన్...!?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరి అలాగే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పలువురు నేతలతో అక్కడ రాజకీయ సందడి నెలకొంది.
By: Tupaki Desk | 29 Dec 2023 12:30 PM GMTఏపీలోని చాలా మంది ఎమ్మెల్యేలు చలో తాడేపల్లి అంటూ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు పయనం అయ్యారు. భీమవరం టూర్ ని ముగించుకుని జగన్ కూడా తాడేపల్లికి చేరుకున్నారు. కీలక నేతలు ఎంపీలు అంతా జగన్ ని కలిసేందుకు వచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరి అలాగే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పలువురు నేతలతో అక్కడ రాజకీయ సందడి నెలకొంది.
ఇక క్షణమో ఘడియో అన్నట్లుగా రెండవ జాబితా వైసీపీ నుంచి రానుంది అని అంటున్నారు. మొత్తం ముప్పయి ఎనిమిది మంది అభ్యర్ధులతో ఈ జాబితా తయారవుతోంది తెలుస్తోంది. ఈ జాబితాలో ఎక్కువగా ఉభయ గోదావరి ఉత్తాంధ్రా జిల్లాలాలో మార్పు చేర్పులు ఉండవచ్చు అని అంటున్నారు.
అదే విధంగా క్రిష్ణా గుంటూరు జిల్లాల నుంచి కూడా కొన్ని ప్లేస్ లలో మార్పుచేర్పులు ఉండవచ్చు అని అంటున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా ఆయన జిల్లాల నుంచ్ ఎమ్మెల్యేలను పిలిపించుకున్నారు. వారితో మంతనాలు జరిపారు. అదే విధంగా మరో వైపు చూస్తే కొందరికి చెప్పాల్సింది చెప్పేశారు. మరి కొందరికి ప్లేస్ మార్పు గురించి వివరించారు.
ఇంకొందరికి టికెట్ రాదు అన్నది కూడా తెలిసిపోయింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా తనకే మరోసారి టికెట్ కేటాయించాలని కోరుతూ వంద కార్లతో తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు. ఆయన భారీ ఎత్తున అనుచరులతో వెళ్లారు అయితే వారంతా మళ్లీ చింతలపూడే తమకు అభ్యర్థి కావాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇక గోదావరి జిల్లాలలో పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు జగ్గంపేట వంటి చోట్ల కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తనకు టికెట్ రాకపోయినా పార్టీకి సహకరిస్తాను అని ప్రకటించడం విశేషం. తోట ఫ్యామిలీకి టికెట్ ఇచ్చినా తన వంతు సాయం ఉంటుందని అన్నారు. అయితే క్యాడర్ ని వారి మనోభావాలను కూడా అధినాయకత్వం గుర్తించి కలుపుకుని పోయేలా చూడాలని ఆయన కోరారు.
అలాగే విశాఖ జిల్లాలో ఆరు సీట్లలో మార్పు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. వీటికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇంచార్జిలను కూడా పిలిపించుకున్నారని తెలుస్తోంది. ఈ ఆరు సీట్లలో చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట, విశాఖ సౌత్ వంటివి ఉన్నాయి. అలాగే ఏజెన్సీలో ఒక సీటు ఉంది అని అంటున్నారు.
అలాగే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో కూడా ఆరు నుంచి ఎనిమిది సీట్లలో మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే ముప్పయి ఎనిమిది మందితో రెండవ జాబితా వెలువడుతుంది అంటే అది ఎవరికి షాకింగ్ గా ఉంటుంది అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా రెండవ లిస్ట్ కి కౌంట్ డౌన్ మొదలైంది అని అంటున్నారు.