ప్లాన్ బీలో చంద్రబాబు....బలమైన వర్గం టార్గెట్
రాజకీయాల్లో మిత్రృత్వాలు శతృత్వాలు ఎపుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అర్ధ శతాబ్దం రాజకీయ జీవితాని ఔపాసన పట్టేసిన చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడికి అయితే ఇలాంటివి అన్నీ బాగా తెలుసు.
By: Tupaki Desk | 15 Dec 2024 3:48 AM GMTరాజకీయాల్లో మిత్రృత్వాలు శతృత్వాలు ఎపుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అర్ధ శతాబ్దం రాజకీయ జీవితాని ఔపాసన పట్టేసిన చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడికి అయితే ఇలాంటివి అన్నీ బాగా తెలుసు. తన పక్కన ఉన్న వారు ఎదురు నిలిచి నిలదీసేందుకు ఎపుడైనా రెడీ అవుతారు అన్నది కూడా ఆయన ఎరుగనిది కాదని అంటున్నారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు రాజకీయంగా ఎపుడూ చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు అని అంటారు. ఆయన ఈ రోజు బాగా ఉన్నామని రిలాక్స్ కారు. ఇక ఇలాగే ఉంటుందని కూడా అతి ధీమాకు సైతం పోరు. ఆయన రేపటి గురించి ఆలోచన చేస్తారు. అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ప్రతికూలతను గురించి ముందే ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అని చెబుతారు.
ఇదంతా ఎందుకు అంటే రేపటి రోజున అనుకోని సవాళ్ళు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కూడడం వల్ల బలమైన సామాజిక వర్గం వెన్ను దన్నుగా ఉంది. కూటమికి అది కాపు కాసింది. ఆ విధంగా 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాను టీడీపీ కూటమి సొంతం చేసుకుంది
టీడీపీకి సైతం చరిత్రలో కనీ వినీ ఎరగని రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈ రోజు ఉన్న పరిస్థితి మారవచ్చు అన్నది కూడా బాగా ఎరిగిన బాబు ప్లాన్ బీలో కూడా ఉన్నారని అంటున్నారు. ఏపీలో కాపు సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా జనసేనకు ఉంది. ఆ తరువాత టీడీపీ వైసీపీలకు ఉంది.
దాంతో టీడీపీ ఆ సామాజికవర్గంలో తమ మద్దతుని మరింతగా పెంచుకోవడానికి భారీ స్కెచ్ ని గీసింది అని అంటున్నారు. దాని ప్రకారం వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. వైసీపీలో బలంగా ఉన్న కాపు నేతలను వరసబెట్టి చేర్చుకునేందుకు టీడీపీ రెడీ అయింది అని అంటున్నారు.
అందులో భాగమే మాజీ మంత్రులు ఆళ్ళ నాని, అవంతి శ్రీనివాస్, అలాగే మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అని అంటున్నారు. ఈ నేతలు ముగ్గురూ తన నియోజకవర్గాలలో బలంగా ఉన్నారు. అంగబలం అర్ధ బలం గట్టిగా ఉన్న వారు. టీడీపీ కూటమి ప్రభంజనంలో వారు ఓటమి పాలు అయి ఉండవచ్చు కానీ మళ్లీ పరిస్థితులు మారితే తమ బలంతో పాటు పార్టీ బలం తోడు చేసుకుని గెలుపు గుర్రాలు ఎక్కేవారే అని అంటున్నారు.
దాంతో వీరి మీద కన్నేసి మరీ టీడీపీ వైసీపీకి దూరం చేసిందని తొందరలోనే వీరిని చేర్చుకుంటోందని అంటున్నారు. చిత్రమేంటి అంటే ఈ ముగ్గురి చేరిక విషయంలో స్థానికంగా టీడీపీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. కానీ వారికి నచ్చచెప్పైనా పార్టీలోకి చేర్చుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.
వీరే కాదు రానున్న రోజులలో ఉత్తరాంధ్ర సహా గోదావరి జిల్లాలలో బలంగా ఉన్న కాపు నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరిట చేర్చుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. ఈ విధంగా చేర్చుకోవడం ద్వారా బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటారు అని అంటున్నారు. రేపటి రోజున రాజకీయ పరిణామాలు ఎటు నుంచి ఎటు తిరిగినా టీడీపీ సేఫ్ జోన్ లో ఉండేలాగానే ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి జనసేన మీద ఆధారపడకుండా బలమైన సామాజిక వర్గంలో తన మద్దతుని మరింతగా పెంచుకుంటే టీడీపీకి తిరుగు ఉండదన్న భావనలో ఉన్నారని అంటున్నారు.