Begin typing your search above and press return to search.

జగన్ కి నో చాన్స్ అంటున్న బాబు

ఏపీలో వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ చాన్స్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు.

By:  Tupaki Desk   |   5 Dec 2024 3:52 AM GMT
జగన్ కి నో చాన్స్ అంటున్న బాబు
X

ఏపీలో వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ చాన్స్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. ఆయన గతాన్ని నుంచి అనేక పాఠాలను నేర్చుకుంటున్నారు. అందుకే ఎక్కడా తప్పులు జరగకుండా చూసుకుంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో బాబు కొన్ని హామీలను అమలు చేయలేక పోయి ఉండవచ్చు.

కానీ ఈసారి మాత్రం కచ్చితంగా అన్ని హామీలను కాస్తా ముందూ వెనకా అయినా నెరవేర్చాలని గట్టి పట్టుదలలో ఉన్నారని అంటున్నారు. వైసీపీకి ఏ విధంగానూ పొలిటికల్ అడ్వాంటేజ్ కలగకుండా చూడాలన్నదే బాబు పంతం అని అంటున్నారు.

ఇక వైసీపీ విషయం చూస్తే సంక్షేమ పధలాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదని అదే చివరికి వారికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మారుతుందని లెక్క వేసుకుంటోంది. జగన్ తరచూ పార్టీ సమావేశాలలో సూపర్ సిక్సూ లేదు సెవెనూ లేదని సెటైర్లు వేస్తూంటారు.

ఇక అభివృద్ధి విషయం తీసుకుంటే టీడీపీయే అక్కడ చాంపియన్. ఆ విషయంలో టీడీపీతో వైసీపీ ఏ విధంగానూ పోటీ పడే సీన్ ఉండదని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ బాబు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. దాంతో పాటు బాబు ట్రాక్ రికార్డు చూసినా అభివృద్ధికి పెద్ద పీట వేస్తారు అని అంతా అంటారు.

ఈ నేపధ్యంలో బాబు సంక్షేమానికి పదును పెడితే చాలు వైసీపీకి జగన్ కి మళ్లీ నో చాన్స్ అని అంటున్నారు. వైసీపీ సూపర్ సిక్స్ హామీలలో అపుడే రెండు నేరవేర్చించింది. పెన్షన్ల పెంపు చేసారు. అది కూటమి అధికారంలోకి వచ్చి మొదటి నెల నుంచే ఇస్తున్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నది కూడా దీపావళి నుంచి స్టార్ట్ చేశారు.

ఇక మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని అంటున్నారు. దానికి సంబంధించి జనవరి మొదట్లోనే బాబు ఒక కీలక ప్రకటన చేస్తారు అని అంటున్నారు. ఉచిత బస్సు సంక్రాంతికి అంటే మహిళా లోకానికి అది అసలైన గిఫ్ట్ గా ఉంటుందని అంటున్నారు.

అదే విధంగా చూస్తే రైతులకు పెట్టుబడి సాయం అన్నదాతా సుఖీభవ పేరుతో అమలు చేయాలని కూటమి నిర్ణయించింది. దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అన్నది మధింపు చేసే పనిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. ఆ లెక్కలు తేలాక దాని మీద కూడా కీలకమైన ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఇది కూడా సంక్రాంతి కానుకగా రైతన్నలకు ఇస్తరాని అంటున్నారు.

మరో వైపు తల్లికి వందనం పేరుతో ప్రతీ విద్యార్ధికి ఇచ్చే పదిహేను వేల రూపాయలను కూడా విద్యా సంవత్సరం పూర్తి కాక ముందే ఇవ్వాలన్న పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే సూపర్ సిక్స్ హమీలు అన్నీ కూడా వరసబెట్టి అమలు చేయాలని బాబు అయితే కంకణం కట్టుకున్నారని అంటున్నారు.

వాటిని కనుక అమలు చేస్తే వైసీపీకి ఏ ఒక్క ఆయుధమూ ఉండదని కూడా అంటున్నారు. అపుడు ఆ పార్టీ జనంలోకి వెళ్ళినా మద్దతు అయితే దక్కే సూచనలు ఉండవని కూడా భావిస్తున్నారు. ఇలా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఎన్ని కష్టాలు ఎదురైఅనా కూటమి బండిని నడిపించడం ద్వారా వరస విజయాలను అందుకోవాలని బాబు మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు. సో కూటమి సూపర్ సిక్స్ తో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.