Begin typing your search above and press return to search.

తాగినోడే కరెక్ట్.....బాబు సంచలన కామెంట్స్

కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ మీద చర్చించారు. అందులో మంచి చెడులను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలంటూ కలెక్టర్లకు సూచించారు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 8:30 AM GMT
తాగినోడే కరెక్ట్.....బాబు సంచలన కామెంట్స్
X

ముఖ్యమంత్రి చంద్రబాబు అప్ టు డేట్ గా ఉంటారు. ఏ అంశం మీద అయినా ఆయన మార్క్ కనిపిస్తుంది. అలాగే లోతైన అధ్యయనం తో పాటు సంబంధించిన ఇష్యూలో కమాండ్ కూడా ఉంటుంది. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ మీద చర్చించారు. అందులో మంచి చెడులను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలంటూ కలెక్టర్లకు సూచించారు.

అంతే కాదు ఎక్కడైనా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయా లేక నగదు చెల్లింపులా వంటివి ఆరా తీసి వాటి మీద కూడా వివరాలు సేకరించి ఇవ్వాలని కోరారు. ఇక బెల్ట్ షాపులు ఎక్కడ పెడుతున్నారు, వాటి వెనక ఎవరు ఉన్నారు ఆ వివరాలు ఇస్తే ఆ ఫీడ్ బ్యాక్ తో ప్రభుత్వం ఏమి చేయాలో అది చేస్తుంది అని ఆయన అన్నారు.

ఇక మద్యం పాలసీ మీద ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని చంద్రబాబు చెబుతున్నపుడు ఉన్నతాధికారి ముఖేష్ కుమార్ మీనా జోక్యం చేసుకుని మందు తాగిన వారి నుంచి అభిప్రాయాలను సేకరించడం మంచిది కాదేమో అని అంటూ ఇది తన పర్సనల్ ఓపీనియన్ అని చెప్పారు.

దానికి చంద్రబాబు బదులిస్తూ తాగుబోతులను లైట్ తీసుకోవద్దు అన్నట్లుగా చెప్పిన మాటలు హైలెట్ గానే ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలీ అంటే మందుబాబులే కరెక్ట్ గా వాస్తవాలు చెబుతారు అని బాబు సంచలన వ్యాఖ్యలే చేశారు. గత ప్రభుత్వాన్ని వారు ఏ విధంగా విమర్శిస్తూ దింపారన్నంది కూడా ఆయన ప్రస్తావించారు.

అందువల్ల వారిని అంత తేలికగా తీసుకోరాదు అని వారే వాస్తవాలు చెబుతారు అని బాబు అన్నపుడు పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు అధికారులు అందరూ నవ్వుతూ ఏకీభవించారు. మొత్తానికి చంద్రబాబు మందు బాబులను పక్కన పెట్టకుండా వారి అభిప్రాయంలోనే ఎంతో విలువ ఉంటుందని చెప్పడం నిజం.

మామూలుగా చూసుకున్నా మందు బాబులు మాటలే కరెక్ట్ గా ఉంటాయన్నది జనాంతికంగా అనుకునే మాట. మందు బాబు నేల మీద నిలబడలేకపోవొచ్చు కానీ మాట మీద నిలబడతాడు అన్నది ఒక ఫ్యామస్ సినిమా డైలాగు. అందువల్ల వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ప్రభుత్వానికి అసలైన నివేదికగానే ఉంటుంది అన్నది బాబు చాలా దూరదృష్టితోనే ఆలోచించి చెప్పారని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో 2024 ఎన్నికల్లో మందుబాబులు కూడా ఒక బలమైన ఓటు బ్యాంకు గా నిలిచి కూటమి విజయం లో భాగం అయ్యారు. చీప్ లిక్కర్ ని ఎవేవో ఊరూ పేరూ లేని బ్రాండ్లను తెచ్చి వైసీపీ ప్రభుత్వం అమ్మడం తో రెచ్చిపోయిన మందుబాబులు ఆ ప్రభుత్వాన్ని సాగనంపడం తో కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో ఢక్కామెక్కీలు తిన్న చంద్రబాబుకు ఇవన్నీ తెలుసు కాబట్టే తాగుబోతులని లైట్ తీసుకోవద్దని అధికారులకు చెప్పారని అంటున్నారు. మొత్తానికి బాబు చెప్పిన ఈ మాటలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.