Begin typing your search above and press return to search.

వంద రోజుల పాల‌న‌.. చంద్ర‌బాబు ఎదురీత‌..!

మ‌రి ఆయ‌న నోట్లో ఏముందో కానీ.. అధికారం చేప‌ట్టిన 100 రోజుల్లో నిజంగానే కూట‌మి ప్ర‌భు త్వం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంది. ఈ స‌మ‌స్య‌ల‌ను చంద్ర‌బాబు స‌వాళ్లుగానే తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   20 Sep 2024 12:30 PM GMT
వంద రోజుల పాల‌న‌.. చంద్ర‌బాబు ఎదురీత‌..!
X

చంద్ర‌బాబు త‌ర‌చుగా ఒక మాట అంటూ ఉంటారు. స‌వాళ్ల‌ను మేం అవ‌కాశాలు మార్చుకుంటాం. ఫైట్ చేస్తాం అని. మ‌రి ఆయ‌న నోట్లో ఏముందో కానీ.. అధికారం చేప‌ట్టిన 100 రోజుల్లో నిజంగానే కూట‌మి ప్ర‌భు త్వం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంది. ఈ స‌మ‌స్య‌ల‌ను చంద్ర‌బాబు స‌వాళ్లుగానే తీసుకున్నారు. ఆవిధంగా నే ప‌నిచేశార‌ని చెప్పాలి. అధికారంలోకి వ‌చ్చిన వారం ప‌ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ దుమారం రేగింది. హ‌త్య‌లు, కొట్లాట‌ల‌తో రాష్ట్రం అట్టుడికింది.

తొలి రోజుల్లో చూసి చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించినా.. త‌ర్వాత వైసీపీ అధినేత జ‌గ‌న్‌దూకుడు పెంచి.. ఢిల్లీలో ధ‌ర్నా చేయ‌డంతో చంద్ర‌బాబు స్పందించి.. త‌మ్ముళ్ల‌కు ప‌దే ప‌దే వార్నింగులు ఇచ్చారు. ఇది ఆయ‌నకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. మ‌రోవైపు.. ఇసుక విష‌యాన్ని కూడా త‌మ్ముళ్లు రాజ‌కీయంగా మార్చుకున్నా రు. అప్పుడే ఉచిత ఇసుక ప‌థ‌కాన్ని ప్రారంభించారు. కానీ, ఇంత‌లోనే అనంతపురం, ఉభ‌య గోదావరి జిల్లాల్లోఇసుక కేంద్రంగా ఇబ్బందులు తెర‌మీదికి వ‌చ్చాయి. వీటిని కూడా అధిగ‌మించారు.

ఇక‌, ఈ వంద రోజుల్లో ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించాయి. విజ‌య‌వాడ‌వ‌ర‌ద‌లు, కాకినాడ జిల్లాలో ఏలేరు సృష్టించిన వ‌ర‌ద‌ల‌తోపాటు ఫ‌స్ట్ ఏలూరు జిల్లాలో ఎర్ర‌వాగు పొంగి గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. ఈ స‌వాళ్ల నుంచికూడా బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఇక, కీల‌క‌మైన రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి, పోల‌వ‌రం నిర్మాణానికి సంబంధించి చంద్ర‌బాబు వ‌చ్చీ రావ‌డంతోనే అడుగులు వేయ‌డం ప్రారంభించారు.

వీటికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే ప్ర‌య‌త్నంలో బ‌డ్జెట్‌లో 15 వేల కోట్ల రూపాయ లు అదేవిధంగా సొంత‌గా మ‌రో 15 వేల కోట్ల‌రూపాయ‌లు సాధించేందుకు ప్ర‌య‌త్నించి.. స‌క్సెస్ అయ్యా రు. ఇవి వ‌చ్చే కొన్ని రోజుల్లోనే రాష్ట్రానికి అంద‌నున్నాయి. ఇక‌, పారిశ్రామికంగా కొంత న‌ష్టం వాటిల్లింది. అన‌కాప‌ల్లి జిల్లాలోని ఫార్మా సెజ్‌లోను.. త‌ర్వాత విశాఖ‌లోని మ‌రో పారిశ్రామిక వాడ‌లోనూ సంభ‌వించిన అగ్ని ప్ర‌మాదాల్లోప‌లువురు మృతి చెందారు. వీరి విష‌యంకూడా చంద్ర‌బాబుకు స‌వాళ్ల‌ను సృష్టించింది. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఎదురీదార‌నే చెప్పాలి. మొత్తానికి ఈ 100 రోజుల పాల‌న‌లో ఎదురీత‌లు త‌ప్ప‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

కొస‌మెరుపు ఏంటంటే.. విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల స‌మ‌యంలోనే స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ విష‌యంలో నిమిషం కూడా ఆలోచించ‌కుండా.. అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఆదిమూలంను పార్టీ నుంచి త‌క్ష‌ణం స‌స్పెండ్ చేసిన చంద్ర‌బాబు.. మ‌ర‌క‌లు పార్టీకి అంట‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.