Begin typing your search above and press return to search.

హిందీతో త‌ప్పేంటి? : చంద్ర‌బాబు

ఒక‌ప్పు డు ఉమ్మ‌డి కుటుంబాలు.. ఈ భార‌తీయ సంస్కృతిలో భాగంగా ఉన్నాయ‌ని .. కానీ, రాను రాను న్యూక్లియ ర్ ఫ్యామిలీలు పెరిగిపోయాయ‌ని చెప్పారు.

By:  Tupaki Desk   |   17 March 2025 4:06 PM IST
హిందీతో త‌ప్పేంటి? :  చంద్ర‌బాబు
X

రాష్ట్రంలో ప్ర‌స్తుతం న్యూక్లియ‌ర్ కుటుంబాలు పెరిగిపోతున్నాయ‌ని.. ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానిం చారు. దీనివ‌ల్ల ఒత్తిళ్లు పెరిగి.. కుటుంబాలు విచ్ఛిన్న‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌న్నారు. ఈ నేప‌థ్యం లో రాష్ట్రంలో ఉమ్మ‌డి కుటుంబాల‌ను ప్రోత్స‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఒక‌ప్పు డు ఉమ్మ‌డి కుటుంబాలు.. ఈ భార‌తీయ సంస్కృతిలో భాగంగా ఉన్నాయ‌ని .. కానీ, రాను రాను న్యూక్లియ ర్ ఫ్యామిలీలు పెరిగిపోయాయ‌ని చెప్పారు.

అయితే.. వ‌చ్చే రెండు మూడేళ్ల‌లో ఉమ్మ‌డి కుటుంబాల‌ను ప్రోత్స‌హించేందుకు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. ఉమ్మ‌డి కుటుంబాల కార‌ణంగా.. కుటుంబ స‌భ్యుల్లో ప‌నిచేసే వ‌య‌సున్న వ్య‌క్తులు ఒత్తిడికి గురి కాకుండా.. ప‌నిని ఫ్రీగా చేసుకునేందుకు వాతావ‌ర‌ణం ఉంటుంద‌న్నారు. దీనివ‌ల్ల కూడా ప‌ర్ క్యాపిటీ ఇన్‌క‌మ్ పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. దీనికి సంబంధించి ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌న్నా రు. ఉమ్మ‌డి కుటుంబాల్లో ఉండేవారిని రేష‌న్ స‌హా ఇత‌ర అంశాల‌పై నిబంధ‌న‌లు ఎత్తేస్తామ‌ని చెప్పారు.

అదేవిధంగా జ‌నాభాను పెంచే కుటుంబాల‌కు కూడా ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్రోత్సాహ‌కాలు అందిస్తామ‌ని సీఎం చెప్పారు. భూములు లేని ప్ర‌జ‌ల‌కు.. సొంత ఇల్లులేని కుటుంబాల‌కు కూడా.. ప్ర‌భుత్వం స‌హ‌కారం చేస్తుంద‌న్నారు. 2029 నాటికి రాష్ట్రంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు ఇల్లులేదు.. అనే మాట లేకుండా చ‌ర్య‌లు తీసు కుంటున్నామ‌ని తెలిపారు. న‌గ‌రాల్లో ప్ర‌జ‌ల‌కు 2 సెంట్ల చొప్పున‌, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3 సెంట్ల చొప్పున భూములు కేటాయించి ఇల్లు కూడా క‌ట్టించి ఇచ్చే బాధ్య‌త‌ను త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటుంద న్నారు.

హిందీతో త‌ప్పేంటి?

ఇక‌, హిందీ భాషా వివాదంపై కూడా చంద్ర‌బాబు అసెంబ్లీలో స్పందించారు. ప్ర‌స్తుతం భాష‌ను ఆయుధం గా మార్చుకుని కొంద‌రు రాజ‌కీయ యుద్ధాల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని ప‌రోక్షంగా పొరుగు రాష్ట్రాల‌ను ఉద్దేశిం చి వ్యాఖ్యానించారు. హిందీ నేర్చుకుంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. అనేక భాష‌లు నేర్చుకుంటే.. దేశ‌వ్యా ప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా.. ఎక్క‌డికి వెళ్లినా ఇబ్బంది లేకుండా ఉంటుంద‌న్నారు. పైగా ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు కూడా పెరుగుతాయ‌ని చెప్పారు. అయితే.. మాతృభాష‌ను విస్మ‌రించాల‌ని మాత్రం తాను సూచించ‌బోన‌న్నారు.