Begin typing your search above and press return to search.

అమరావతి టు బందరు..బాబు గుడ్ న్యూస్

ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాలనను పరిగెత్తిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Oct 2024 5:12 AM GMT
అమరావతి టు బందరు..బాబు గుడ్ న్యూస్
X

ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాలనను పరిగెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తన బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్న చంద్రబాబు మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ..సరికొత్త ప్రణాళిలతో రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జగన్ హయాంలో అప్పుల కుప్పగా మారిన ఖజానాతోనే పాలనను పరుగులు పెట్టిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే తాజాగా బందర్ పోర్టు పనులను 2025నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

రూ.3,669 కోట్ల అంచనాతో ఆ పోర్టు పనులు మొదలుబెట్టినా 24 శాతం మాత్రమే గత ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. పోర్టు నిర్మాణానికి మరో 38.32 ఎకరాల భూమి అందిస్తామని చెప్పారు. ఈ పోర్టు మచిలీపట్నం అభివృద్ధికి దోహదపడుతుందని, అమరావతికి కూడా దగ్గరగా ఉంటుందని చెప్పారు. ఈ పోర్టుకు అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ స్ట్రీమ్ లైన్, నీటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. బందరు పోర్టును కంటైనర్ పోర్టు కింద ఇంటిగ్రేడ్ చేస్తే తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పోర్టు పనులను తన హయాంలో ప్రారంభిస్తే తర్వాత వచ్చిన పాలకులు విధానాలు మార్చి నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు.

వారి మాదిరిగానే తాను కూడా మార్పులు చేర్పులు చేస్తే విధ్వంసం చేసినట్లవుతుందని, అందుకే పనులను యథాతథంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు తెస్తామని, బీపీసీఎల్ ఏర్పాటు పై త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పారు. పోలీస్ ల్యాండ్ లో కట్టిన వైసీపీ కార్యాలయంపై సమాచారం సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.