Begin typing your search above and press return to search.

మందుబాబులకు బాబు మరో గుడ్ న్యూస్... తగ్గొద్దంటున్నారు!

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రూ.99 కే క్వార్టర్ లిక్కర్ బాటిల్ తో పాటు ఉచిత ఇసుక పథకాన్ని అమలుచేశారు చంద్రబాబు.

By:  Tupaki Desk   |   27 Oct 2024 5:31 AM GMT
మందుబాబులకు బాబు మరో గుడ్  న్యూస్... తగ్గొద్దంటున్నారు!
X

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రూ.99 కే క్వార్టర్ లిక్కర్ బాటిల్ తో పాటు ఉచిత ఇసుక పథకాన్ని అమలుచేశారు చంద్రబాబు. అయితే... గత కొన్ని రోజులుగా ఈ విషయంలొ టీడీపీ నేతలకు, ఎమ్మెల్యేలకూ బాబు ఓ ఆదేశం జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా... మద్యం, ఇసుక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెబుతున్నారు.

అయితే... బాబు ఆదేశాలను శిరసా వహించే విషయంలో పలువురు ఎమెల్యేలు, నేతలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా ఇసుక, మద్యం విషయాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఎక్కువైపోతుందనే విషయం బాబు దృష్టికి వచ్చిందని అంటున్నారు. ఈ సమయంలో.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే విషయంలో లిక్కర్ షాపులపై తిరగబడాలని బాబు పిలుపునిచ్చారు!

అవును... 2014 - 19 సమయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా పలువురు టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీలు వ్యవహరించాయనే పేరు ఉన్న నేపథ్యంలో... ఈసారి చంద్రబాబు ఆ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. లిక్కర్ షాపుల్లో మద్యం అధిక ధరకు అమ్మినా, ఇసుక విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుని దందా చేసినా తిరగబడాలని పిలుపునిచ్చారు.

మంగళగిరిలోని టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. పలు విషయాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఇందులో భాగంగా.. ఎవరూ ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. ఇసుక అక్రమదందా చేసేవారిపై తిరగబడాలని ప్రజలకు పిలునిచ్చారు! ఇదే సమయంలో మద్యం విషయంలోనూ గట్టిగానే చెప్పారు చంద్రబాబు.

ఇందులో భాగంగా... క్వార్టర్ బాటిల్ ని రూ.99 కే ఫిక్స్ చేశామని.. అంతకు మించి ఒక్క పైసా వసూల్ చేసినా కఠిన చర్యలు తప్పవని వైన్ షాపులకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు... ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వొద్దని మందుబాబులకు సూచించారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు అడిగితే... తిరగబడమని, ఈ విషయం సీఎం చెప్పారని చెప్పండి అని బాబు వ్యాఖ్యానించారు!