ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ?
ఈ ఇద్దరి పార్టీల నుంచి మొత్తం 18 ఎంపీ సీట్లు కేంద్రంలోని ఎన్డీయే ప్రాణప్రదంగా మారాయి.
By: Tupaki Desk | 17 Oct 2024 10:10 AM GMTకేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏపీ వైపు చూస్తోంది. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతి ముఖ్య మద్దతుదారులుగా ఉన్నారు. ఈ ఇద్దరి పార్టీల నుంచి మొత్తం 18 ఎంపీ సీట్లు కేంద్రంలోని ఎన్డీయే ప్రాణప్రదంగా మారాయి.
దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు పవన్ కి ఎన్డీయేలో ఎంతో ప్రాధాన్యత లభిస్తోంది. ఇదిలా ఉంటే హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి చంద్రబాబు పవన్ లకు ఆహ్వానం అందింది.
దాంతో ఈ ఇద్దరూ ప్రత్యేక విమానంలో బయలుదేరి చండీఘర్ చేరుకున్నారు. ఈ ప్రమాణంలో ఈ ఇద్దరు నేతలు ఆకర్షణగా నిలిచారు ఇక ఈ సమావేశం తరువాత ఎన్డీయే పక్షాలతో కలసి కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చంద్రబాబు పవన్ మిత్ర పక్షాలుగా పాల్గొంటారు. ఈ ఇద్దరితో పాటు ఇతర ఎన్డీయే పక్షాలు కూడా పాలు పంచుకుంటాయి.
ఈ సందర్భంగా జమిలి ఎన్నికలు దేశంలో నిర్వహించడమే అజెండాగా చేసుకుంటారని తెలుస్తోంది. జమిలి ఎన్నికలకు బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది. దాని మీదనే సీరియస్ గా చర్చిస్తారు అని అంటున్నారు. మూడో విడత కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే పాలన గురించి ప్రధాని మిత్రపక్షాలకు వివరిస్తారని అంటున్నారు
అంతే కాదు జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి కూడా ఈ సమావేశంలో వివరించి మిత్రుల నుంచి ఆమోదం తీసుకుంటారని తెలుస్తోంది. అంతే కాదు మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ సమావేశాలోనే ఎన్డీయే కన్వీనర్ గా కీలకమైన పదవిని చంద్రబాబుకు ఇస్తారు అని అంటున్నారు.
చాలా కాలంగా ఇది ప్రచారంలో ఉన్నా ఈసారి ఇది జరిగి తీరుతుందని అంటున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే గాయనకు ఈ పదవి కొత్త కాదు గతంలో వాజ్ పేయి టైం లో ఆయన ఈ పదవిని చేపట్టారు. ఇపుడు మరోసారి బాబు ఎన్డీయే పక్షాన జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషిసారు అని అంటున్నారు.
ఈ మేరకు బాబుని పూర్తిగా విశ్వాసంలోకి తీసుకుని ఆయనకు ఎండీయే కన్వీనర్ కిరీటం తొడగాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని టాక్. దీంతో చంద్రబాబు ద్వారా జమిలి ఎన్నికల్తో పాటు బీజేపీ అజెండాని స్మూత్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెరవేర్చుకునే ప్రయత్నం ఒకటి జరుగుతుందని అంటున్నారు.
ఇక చండీఘర్ వెళ్ళిన చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్క సీటు ఇచ్చి మరీ గౌరవించారు. మరో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే కేంద్రంలో కీలక మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ ఇంకో కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ బాబుతో అప్యాయంగా మాట్లాడం జరిగింది. ఇక బాబుని రిసీవ్ చేసుకోవడమే చాలా గొప్పగా జరిగింది.
మొత్తానికి బీజేపీ పెద్దలు తమకు చంద్రబాబు కొండంత అండ అని భావిస్తున్నారు. అందుకే బాబుకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు. బాబు సైతం కేంద్ర బీజేపీ పెద్దల వద్ద తన పెద్దరికం నిలబెట్టుకుంటూ జాతీయ రాజకీయాల్లో తగిన విధంగా తన పాత్రను నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద ఎన్డీయే సమావేశంలో టీడీపీ అధినాయకుడు చంద్రబాబే హైలెట్ గా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.