Begin typing your search above and press return to search.

ఇవేమి హైదరాబాదీ మాటలు బాబూ !

తాను ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నపుడు హైదరాబాద్ ని ఎంతో అభివృద్ధి చేశాను అని గట్టిగా చెప్పుకున్నారు

By:  Tupaki Desk   |   19 Oct 2024 11:43 AM GMT
ఇవేమి హైదరాబాదీ మాటలు బాబూ !
X

టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు గోరంత చేసి కొండంత చెప్పుకోవడంలో నిపుణుడు అని అందరూ అంటారు. ఆయన చెప్పే మాటలు వింటే ఈ ప్రపంచంలో అన్నీ ఆయనే కనిపెట్టేశారా అని ఒక్కోసారి డౌట్లు కూడా వస్తూంటాయి. కానీ చంద్రబాబు స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన ఎవరు ఏమనుకున్నా తాను చెప్పాల్సింది చెబుతూనే ఉంటారు.

అది కంటిన్యూగా చెబూతూ అదే నిజం అని జనం మైండ్ లోకి జొప్పించే ప్రయత్నం చేస్తూంటారు. ఇదిలా ఉండగా చంద్రబాబు అమరావతిలో పనులను తాజాగా ప్రారంభిస్తూ మధ్యలో హైదరాబాద్ నగరం గురించి ప్రస్తావనకు తెచ్చారు. తాను ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నపుడు హైదరాబాద్ ని ఎంతో అభివృద్ధి చేశాను అని గట్టిగా చెప్పుకున్నారు

ఆ ఫ్లోలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ మీదనే ఇపుడు చర్చ సాగుతోంది. హైదరాబాద్ ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దాను అని బాబు చెప్పడమే ఓవర్ అయింది అని అంటున్నారు. 2004 లోనే బాబు ఉమ్మడి ఏపీ సీఎం గా దిగిపోయారు. ఆనాటికీ ఈనాటికీ కూడా హైదరాబాద్ దేశంలో నంబర్ వన్ అయితే కాదు, మరి ఎక్కడ నుంచి ఈ మాటలు పుట్టుకుని వచ్చాయి బాబూ అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

కొంచెం అయినా నిజం చెప్పండి బాబు గారూ అని కూడా అంటున్నారు. హైదరబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందని అందరికీ తెలుసు. పైగా హైదరాబాద్ అభివృద్ధి ఏ ఒక్కరితో ఒక్క రోజుతో మాత్రం జరగలేదు అన్నది కూడా అందరికీ తెలుసు. అందరూ కలసి హైదరాబాద్ ని అభివృద్ధి చేశారు. అందులో చంద్రబాబు పాత్ర కూడా ఉంది. అయితే తాను ఒక్కడినే హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను అని చంద్రబాబు చెప్పడం పట్ల ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఇక తాను ప్రారభించిన అభివృద్ధి పనులను తరువాత కాలంలో వచ్చిన ముఖ్యమంత్రులు అంతా కొనసాగించారు అని చంద్రబాబే గతంలో చెప్పారు. ఇపుడు ఆయన చెప్పిన దానినే మరచి తానే హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను అని చెప్పడమేంటి అని ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు.

అంతే కాదు హైదరాబాద్ తన హయాంలోనే నంబర్ వన్ సిటీగా దేశంలో మార్చామని బాబు చెప్పడమే ఇపుడు అంతా ట్రోల్ చేసేందుకు కారణం అవుతోంది. ఇక ఇరవై ఏళ్ల క్రితమే ఎనిమిది లైన్ల రోడ్లకు తాను ప్లాన్ చేస్తే అంతా ఆశ్చర్యపోయారు అని కూడా బాబు అంటున్నారు. ఇలా బాబు తన గొప్పలను తానే చెప్పుకుంటున్నారు అని అంటున్నారు. అయితే ఏది చెప్పినా కూడా అతికినట్లుగా ఉండాలని అంటారు. చంద్రబాబు మాత్రం తాను చేసిన గోరంతని కొండంతగా చెబుతూ అంతా తానే అని భావించుకోవడం పట్లనే చర్చ సాగుతోంది.

మరో వైపు చూస్తే హైదరాబాద్ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా దశలవారీగా అభివృద్ధి చెందింది. అందులో అందరి పాత్ర ఉంది అన్నది మరువరాదు అని అంటున్నారు. హైదరాబాద్ ని తానే అభివృద్ధి చేశాను అని చెప్పిన చంద్రబాబు టీడీపీ తెలంగాణా శాఖ మాత్రం ఎందుకు ఎత్తిగిల్లడంలేదు అన్నది కూడా మరో కీలక పాయింట్ గా ముందుకు తెచ్చే వారు ఉన్నారు.

కొన్ని సార్లు కాలం కలసి వచ్చినపుడు కొందరి టైంలో కొంత అభివృద్ధి జరుగుతుంది. అలా ఐటీ రంగం విస్తరించినపుడు హైదరాబాద్ కూడా కేంద్రం అయింది. ఆ టైం లో సీఎం గా ఎవరు ఉన్నారు అనేదానిని అభివృద్ధి అనేది చూడదు, మొత్తం మీద అమరావతిని దేశంలోనే గొప్పగా అభివృద్ధి చేస్తాను అని బాబు చెప్పుకోవడానికి మధ్యలో హైదరాబాద్ ని తెచ్చి చాలానే ఆర్భాటం చేశారు అని అంటున్నారు.