చంద్ర బాబు రిస్క్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
By: Tupaki Desk | 5 Sep 2024 1:50 PM GMTఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ వరద బాధితులకు భరోసాగా బాబు ఈ వయసులో కూడా 24 గంటలు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. మోకాళ్ళ లోతు నీళ్లలో ధైర్యంగా ముందడుగు వేస్తూ, బాధితులను పరామర్శిస్తూ బాబు అందరిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఈరోజు అదే విధంగా బుడమేరు దగ్గర పరిస్థితులను అంచనా వేయడానికి వెళ్ళిన బాబుకి తృటిలో ప్రమాదం తప్పింది.
బుడమేరు ప్రవాహం ఎలా ఉంది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో తో చంద్రబాబు అక్కడ ఉన్న రైల్వే ట్రాక్ పైకి ఎక్కారు. అయితే అనుకోకుండా అదే సమయానికి ట్రైన్ రావడంతో అంతా షాక్ అయ్యారు. ట్రెయిన్ చూసిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. చంద్రబాబు కాస్త పక్కకి నిలబడి ఉండడంతో ట్రైన్ ఆయనకి అత్యంత సమీపంగా వెళ్ళింది.
అదే సమయానికి ట్రైన్ నిలిచిపోవడంతో సీఎంకు పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. చంద్ర బాబు సేఫ్ గా ఉండడంతో అక్కడ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోజులాగానే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జరుగుతున్న సహాయ కార్యక్రమాలను పరిశీలిస్తూ.. ప్రజలను పరామర్శిస్తూ ఉన్నారు.
ఈ రోజు ఉదయం ఆయన నిడమానూరు ప్రాంతంలో బుడమేరు గండిన పరిశీలించడానికి వెళ్లారు.ఆ తర్వాత అక్కడనుంచి విజయవాడ సిటీలోని మధురానగర్ కు వెళ్లారు.అక్కడే ఆయన బుడమేరు ప్రవాహాన్ని అంచనా వేయడం కోసం రైలు వంతెనపైకి కాలి నడకన వెళ్లడంతో వెంట్రుక వాసిలో పెద్ద ప్రమాదం తప్పింది.
తొలుత వంతెన పైకి వెళ్లొద్దని భద్రతా సిబ్బంది చంద్ర బాబు ను వారించారు. కానీ వరద ప్రవాహం కనిపించకపోవడంతో చంద్ర బాబు రైల్వే ట్రాక్ పై నుంచి పరిశీలన చేసేందుకు వంతెనపై వెళ్ళారు.ఆయన వంతెనపై నడుస్తున్న సమయంలో సడన్గా ఎదురుగా రైలు వచ్చింది.ట్రైన్ రావడం చివరి నిమషంలో గమనించిన చంద్ర బాబు ట్రాక్ పక్కన నిల్చున్నారు.