ఏపీ బీజేపీలో జోష్.. రీజన్ ఇదేనా ...!
అయితే.. తమకు ఒక్క సీటు ఇవ్వడంపై బీజేపీ నాయకులు ఆది నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 March 2025 10:41 AM ISTకూటమి పార్టీల్లో కీలకమైన బీజేపీలో జోష్ నెలకొంది. సోమవారం సాయంత్రం ప్రభుత్వాధినేత అయిన సీఎం చంద్రబాబు నుంచి కీలకమైన సమాచారం లీకైంది. ఇది కూటమిలోని అన్నిపార్టీలకూ విస్తరించిం ది. దీంతో గత రాత్రి నుంచే బీజేపీ నాయకులు సంబరాల్లో ఉన్నారు. దీనికి కారణం.. నాలుగు రోజుల్లో మంత్రి వర్గ ప్రక్షాళన చేయనుండడమే. గత ఏడాది జూన్‌లో ఏర్పడిన మంత్రివర్గానికి ప్రస్తుతం 10వ నెల జరుగుతోంది. అయితే.. ఇంతలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం గమనార్హం.
రెండు కారణాలు..
చంద్రబాబు మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
1) కొత్త వారికి అవకాశం ఇవ్వడం.
2) ప్రోగ్రెస్‌లో వెనుకబడిన వారిని పక్కన పెట్టాలన్న నిర్ణయం.
ఈ రెండు కారణాలతోనే మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కూటమి పార్టీలను గమనిస్తే.. బీజేపీకి 1, జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. మరొకటి ఖాళీగా ఉంది. అయితే.. ఇప్పుడు కొత్తగా మరో స్థానం కూడా జనసేనకు దక్కనుంది.
ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్నెల్సీగా ఎన్నికైన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. తన మంత్రివర్గంలో నాగబాబును చేర్చుకోనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన సంఖ్య నాలుగుకు చేరనుంది. అయితే.. తమకు ఒక్క సీటు ఇవ్వడంపై బీజేపీ నాయకులు ఆది నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి మరో సీటు ఇప్పుడు ఇవ్వనున్నట్టు సమాచారం.
దీంతో ప్రస్తుతం ఉన్నవారిలో ఒకరిని తప్పించే ప్రయత్నం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. దీని పై ప్రత్యేకంగా సమాచారం లేదు. కానీ, ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు దగ్గర బీజేపీ పెద్దలు ఇదే విషయం చర్చించడంతో ఇప్పుడు బీజేపీకి మరో సీటు ఖాయమన్న వాదన బల పడుతోంది. ఇదిలావుం టే, ఆదివారం ఉగాదిని పురస్కరించుకుని పలుకీలక కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నా రు. ఈ నేపథ్యంలో అదే రోజు.. మంత్రి వర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది.