వదినమ్మ ను పొగిడిన బాబు
చంద్రబాబు ఎక్కువగా తన భావాలను దాచుకుంటారు. అయితే ఇటీవల ఆయన తన ఎమోషన్స్ ని బయటపెడుతున్నారు.
By: Tupaki Desk | 19 Sep 2024 3:37 AM GMTచంద్రబాబు ఎక్కువగా తన భావాలను దాచుకుంటారు. అయితే ఇటీవల ఆయన తన ఎమోషన్స్ ని బయటపెడుతున్నారు. ఆయన తీరులోనే చాలా మార్పు వచ్చింది. ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి విజయం వెనక పవన్ కళ్యాణ్, దగ్గుబటి పురంధేశ్వరి ఉన్నారని అని బాహాటంగా మరోమారు చెప్పారు.
బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా పురంధేశ్వరి కాకుండా వేరు ఎవరు ఉన్నా కూటమి ఏర్పాటు జరిగేదా అని బాబు ప్రశ్నించారు. అలా తనలో అనుమానాలు కూడా కలుగుతూండేవి అన్నారు పురంధేశ్వరి పూర్తి స్థాయిలో కూటమి ఏర్పాటుకు తన తోడ్పాటుని అందించారు అని వదినమ్మను బాబు ఎన్డీయే సభా సాక్షిగా తెగ పొగిడారు.
తనతో పాటు పవన్ పురంధేశ్వరి ఇలా ముగ్గురి కాంబినేషన్ తోనే కూటమి ఘన విజయం సాధించింది అని బాబు అన్నారు.బాబు ఈ మాటలు అనడం వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పురంధేశ్వరి నియామకం సరిగ్గా ఎన్నికల వేళ జరిగింది. అంతకు ముందు వేరేవారు ఉండేవారు.
కేంద్ర బీజేపీ పెద్దలకు ఏపీ బీజేపీ నేతలు ఇచ్చే ఫీడింగ్ కూడా చాలా ముఖ్యం. వారు వద్దు అని అంటే కనుక ఎంతో కొంత గ్యాప్ వచ్చేది. అలా కాకుండా మొదటి నుంచి కూటమికి పూర్తి హెల్ప్ గా పురంధేశ్వరి వ్యవహరించారు అని అంటున్నారు. అలా బీజేపీలోని యాంటీ టీడీపీ నేతలకు చెక్ పెట్టగలిగారు అని కూడా అంటున్నారు.
అందుకే చంద్రబాబు పురంధేశ్వరి సాయం కూడా చాలా ఉందని అన్నారు. ఆమె అటు నుంచి నరుక్కు వచ్చి కూటమి విజయం సానుకూలం కావడానికి తన వంతుగా ఎంతో ప్రయత్నం చేశారు అని అంటున్నారు. ఇలా మూడు పార్టీలూ ముగ్గురు నేతలూ ఒక్కటిగా వ్యవహరించడం వల్లనే ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఇబ్బందులు లేకుండా కలసి సాగడం జరిగింది అని అన్నారు. దీని వల్ల ఏకంగా 93 శాతం స్ట్రైకింగ్ రేటు వచ్చింది అని కూడా అన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా అంతా కష్టపడ్డారు అని కూడా బాబు అన్నారు.
మరో వైపు చూస్తే ఈ కూటమి బంధం శాశ్వతం కావాలని కూడా చంద్రబాబు కోరడం విశేషం. పవన్ కళ్యాణ్ తాను జైలులో ఉండగా వచ్చి పరామర్శించి అక్కడే పొత్తు ప్రకటన చేశారు అని కూడా బాబు గుర్తు చేసుకున్నారు.
టీడీపీ కూటమి ఒక్కటిగా ఉంటే ఎప్పటికీ అధికారంలో ఉంటుంది అన్న భావనతోనే ఆయన కలసికట్టుగా అంతా ఉండాలని కోరుకున్నారని అంటున్నారు. మొత్తానికి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పురంధేశ్వరి పదవీ కాలం ముగుస్తున్న వేళ కొత్త వారికి ప్రెసిడెంట్ గా చేస్తారు అని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ బాబు చేస్తున్న ఈ ప్రకటనలు వదినమ్మను పొగడడం మీద చర్చ అయితే సాగుతోంది.