తెలంగాణ అభివృద్ధికి టీడీపీనే కారణం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
గత నాలుగు రోజులుగా బడ్జెట్‌పైనే అసెంబ్లీలో చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 15 Nov 2024 10:31 AM GMTఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. గత సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కాగా.. ఈ నెల 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులోభాగంగా గత సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత నాలుగు రోజులుగా బడ్జెట్‌పైనే అసెంబ్లీలో చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
గత మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు మూడు నాలుగు నెలలకు గాను ఓటాన్ అకౌంట్‌ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మరో నాలుగు నెలలకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.
అలాగే.. పలు కీలక బిల్లులను సైతం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా ప్రస్తుత ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 1982 ఇబ్బందిగా ఉందని, దానిని రద్దు చేసి కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 2024ను ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు దేవాలయాల్లోని పాలక మండళ్లలో అదనంగా మరో ఇద్దరు సభ్యుల నియామకంపైనా బిల్లును పెట్టనున్నది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోనే తెలంగాణ నంబర్ 1గా ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీనే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలసీలతో పాలనను ఒక దారికి 1995లో తీసుకొచ్చామని తెలిపారు. దాని ఫలితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. నూతన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశామని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించడం చర్చకు దారితీసింది.