దావోస్‌లో 'ఉచితాల' చర్చ.. చంద్రబాబు నయా గేమ్ ఇదే..!
ఇప్పటికే రెండు రోజులుగా దావోస్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు.. తాజాగా పెద్ద ఇబ్బంది వచ్చింది.
By: Tupaki Desk | 22 Jan 2025 5:30 PM GMTఏపీలో అభివృద్ధి జరగాలంటే.. పెట్టుబడులు భారీ ఎత్తున రావాల్సిందేనని, తద్వారా ఉద్యోగాలు, ఉపాధి కి కూడా ఊతం లభిస్తుందని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అసలు ఆయన మంత్రం కూ డా పెట్టుబడులు, అభివృద్ధి కావడంతో ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాల్లోనే పెద్ద పెద్ద కలలతో ఆయన దావోస్‌కు వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను ఏపీకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా దావోస్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు.. తాజాగా పెద్ద ఇబ్బంది వచ్చింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలపై చర్చ వచ్చింది. గతంలో వైసీపీ హయాంలోనూ ఇలానే ఉచిత పథకాలు చాలానే అమలయ్యాయని.. అందుకే తాము పెట్టుబడులు పెట్టేందుకు విరమించుకున్నామని జర్మనీకి చెందిన ప్రఖ్యాత సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్టు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉచిత పథకాలను వదులు కోవాలన్న సూచనలను కూడా వారు ప్రస్తావించారు. వీటిలో గూగుల్ కూడా ఉందని వారు గుర్తు చేశారు. అంతేకాదు..తమ వ్యూహాలను కూడా వివరించారు.
ఉచిత పథకాలను తగ్గించుకుని.. ముందుకు సాగే ప్రభుత్వాల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని కూడా వారు వెల్లడించడం గమనార్హం. ఇదే సమయంలో ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలపైనా వారు ఆరా తీసినట్టు తెలిసింది. `ఫ్రీబీస్`గా పేర్కొనే ఈ పథకాలను తెలుసుకున్న తర్వాత.. నిర్ణయం వెల్లడిస్తామని చెప్పినట్టు సమాచారం. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగారు. ఉచిత పథకాలను లబ్ధిదారులనై వారికి అందిస్తామని చెప్పుకొచ్చారు.
దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని.. ప్రజలకు వెసులుబాటు ఉంటుందని కూడా ఆయన వివరించినట్టు తెలిసింది. ఉచితాలు అనర్థాలు కావని, తద్వారా.. కంపెనీ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసేందుకు ఇది ఇతోధికంగా సాయం చేస్తుందని.. వివరించి.. వారిని ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిసింది. దీంతో సదరు జపాన్ కంపెనీ 500 కోట్ల రూపాయల పెట్టుబడికి నేడో రేపో ఒప్పందం చేసుకుంటుందని తెలిసింది. ఉచితాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వారిని ఒప్పించడం గమనార్హం.