Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ పైనా బాబు మార్కు.. స‌ర్వే చేయిస్తున్నారే.. !

లాబీల్లో చాలా మంది నాయ‌కులు.. ఈ విష‌యం చ‌ర్చించుకున్నారు. మేధావులు సైతం ఈ బ‌డ్జెట్ బాగుందన్న వాద‌న వినిపిస్తున్నార‌ని.. ప‌లువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   6 March 2025 11:24 AM IST
బ‌డ్జెట్ పైనా బాబు మార్కు.. స‌ర్వే చేయిస్తున్నారే.. !
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఏం చేసినా.. దానిపై ప్ర‌జ‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవ‌డం అల‌వాటు. కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన‌.. పూర్తిస్థాయి బ‌డ్జెట్‌పైనా.. ఆయ‌న మేధావుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఈ విష‌యం తాజాగా అసెంబ్లీ దృష్టికి కూడా వ‌చ్చింది. లాబీల్లో చాలా మంది నాయ‌కులు.. ఈ విష‌యం చ‌ర్చించుకున్నారు. మేధావులు సైతం ఈ బ‌డ్జెట్ బాగుందన్న వాద‌న వినిపిస్తున్నార‌ని.. ప‌లువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ప్రాధ‌మికంగా స‌ర్వేలో ఏం తేలిందంటే..

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2025 వార్షిక బ‌డ్జెట్‌పై మేధావుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నా యి. జ‌న సామాన్య బ‌డ్జెట్ అంటూ.. మేధావులు కొనియాడుతున్నారు. అతికిపోకుండా.. అప్పులు చేయ కుండా.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ బ‌డ్జెట్ ఉంద‌ని చెబుతున్నారు. ఏపీ ప్ర‌భుత్వం శుక్ర‌వారం వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టింది. అనంత‌రం.. దీనిపై మేధావులు సానుకూల ఫీడ్ బ్యాక్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో మాదిరిగా కేవ‌లం బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌లే ద‌ని చెబుతున్నారు.

ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు మెరుగు ప‌డేలా.. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా రాష్ట్రంలోని యువ‌త‌కు దేశ విదేశాల్లోనూ ఉపాధి ల‌భిస్తుంద‌ని మేధావులు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని ని స్వ‌యం ప్ర‌తిప‌త్తిగ‌ల ఆర్థిక సంస్థ‌గా తీర్చిదిద్దే క్ర‌మంలో ప్ర‌భుత్వం నిర్మాణాత్మ‌క పాత్ర‌పోషిస్తుండ‌డం కూడా రాజ‌ధాని నిర్మాణాన్ని మ‌రింత వేగంగా పూర్తి చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. త‌ద్వారా అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెబుతున్నారు.

ఇక‌, కీల‌క‌మైన సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు ప్ర‌భుత్వం చెబుతున్న ద‌రిమిలా.. భ‌విష్య‌త్తులో ఈ రంగంలో మ‌రిన్ని ఉద్యోగాలు, ఉపాధులు ల‌భిస్తాయ‌ని మేధావులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ఆతిథ్య రంగానికి ఏపీ కేంద్రంగా మారుతోంద‌ని చెబుతున్నారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు, తల్లికి వందనం కింద రూ.15 వేలు, రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించ‌డం ద్వారా.. జ‌న సామాన్యానికి ఈ బ‌డ్జెట్ చేరువ అయిన‌ట్టేన‌ని చెబుతున్నారు.

న‌వోద‌యం 2.0 కార్య‌క్ర‌మానికి 10 కోట్లు కేటాయించ‌డం ద్వారా.. నాటు సారా నుంచి రాష్ట్రానికి విముక్తి క‌లిగించ వ‌చ్చ‌ని చెబుతున్నారు. అలానే ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు కేటాయించ‌డం ద్వారా.. ఆయా వ‌ర్గాలకు సామాజిక భ‌ద్ర‌త‌తో పాటు ఆర్థిక భద్ర‌త‌ను క‌ల్పించిన‌ట్టు అయింద‌ని అంటున్నారు.

కేవ‌లం ఉచితాలు ఇవ్వ‌డ‌మే కాకుండా.. ప్ర‌జ‌లు స్వ‌యం కృషితో ప్ర‌భుత్వ సాయంతో ఆర్థికంగా బ‌లోపే తం అయ్యేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు మేధావులు చెబుతున్నారు.