Begin typing your search above and press return to search.

కూటమి ఫ్యూచర్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

2019 ఎన్నికల సమయంలో 151 స్థానాల్లో గెలిచి రికార్డ్ సృష్టించిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి 11 స్థానాలకు పరిమితమైంది.

By:  Tupaki Desk   |   17 Nov 2024 3:29 AM GMT
కూటమి ఫ్యూచర్  పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
X

2019 ఎన్నికల సమయంలో 151 స్థానాల్లో గెలిచి రికార్డ్ సృష్టించిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి 11 స్థానాలకు పరిమితమైంది. ఈ ఘోర పతనానికి వైసీపీ స్వయంకృతాపరాదాలు ఒకెత్తు అయితే.. ఐకమత్యంతో కూడిన కూటమి పోరాట పటిమ మరోకెత్తు అని అంటారు. మూడు పార్టీలు కలిసి వైసీపీని పెద్ద దెబ్బే కొట్టాయి. ఈ క్రమంలో కూటమి ఫ్యూచర్ పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీ రాజకీయాల్లో టీడీపీ - బీజేపీ - జనసేనతో కలిసి కూటమి సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో త్వరలో జమిలీ ఎన్నికలు అని అంటున్నారు.. అలా కానిపక్షంలో 2029లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కూటమి ఫ్యూచర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. హస్తిన వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు పలు కీలక విషయాలపై స్పందించారు. ఇందులో భాగంగా... టీడీపీ తొలి నుంచీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని.. దేశాభివృద్ధి కోసం తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని.. బీజేపీకి వాజపేయి పునాదులు వేస్తే.. నరేంద్ర మొడీ బలోపేతం చేశారని అన్నారు.

ఇక రానున్న రోజుల్లో ప్రపంచంలో భారత్ రెండు, మూడు స్థానాల్లో ఉంటుందని చెప్పిన చంద్రబాబు.. నరేంద్ర మోడీనే తమ నాయకుడని, ఆయన నేతృత్వంలోనే ముందుకు వెళ్తామని తెలిపారు. ఇక 2029 ఎన్నికలకు ఏపీలో ఇప్పటికే సమాయత్తమవుతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు.

దానికి గల కారణం... ఏపీలో గత ప్రభుత్వ పాలనపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తితో పాటు.. ఎన్డీయే కూటమిపై జనానికి నమ్మకం, భరోసా కలిగిందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని తాము ముందే ఊహించామని.. చరిత్రలో ఎన్నడూ లేని తీర్పు ఏపీ ప్రజలు ఇచ్చారని బాబు గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలోనే... కూటమి ఫ్యూచర్ పై బాబు స్పందించారు. ఇంద్లో భాగంగా... కూటమిలో ఎలాంటి సమస్యలూ లేవని, అందరూ కలిసి కట్టుగా ముందూ సాగుతున్నామని.. ఈ కూటమి దీర్ఘకాలం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు!