Begin typing your search above and press return to search.

గవర్నర్ తో బాబు భేటీ...మ్యాటర్ అదే

అదే సమయంలో నవంబర్ నెలలో ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   30 Oct 2024 12:30 AM GMT
గవర్నర్ తో బాబు భేటీ...మ్యాటర్ అదే
X

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం అయ్యారు. ఆయన రాత్రి పొద్దుపోయాక జరిపిన ఈ భేటీ మీద పలు రకాలైన చర్చలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి గవర్నర్ తో భేటీ కావడం అన్నది రాజ్యాంగబద్ధంగా ఉన్న బాధ్యతలలో ఒకటి అన్నది వాస్తవం. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తరఫున సీఎం పాలిస్తారు. అందువల్ల ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏమిటి అన్నది గవర్నర్ కి తెలియచేయడం అన్నది కూడా విధిగా పేర్కొంటారు.

ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు గవర్నర్ నజీర్ తో భేటీ అయినది కీలక అంశాల గురించి చర్చించడానికే అని అంటున్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు గురించి వివరించారు. అదే సమయంలో నవంబర్ నెలలో ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందువల్ల పూర్తి స్థాయి బడ్జెట్ అంటే గవర్నర్ హాజరై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అని అంటున్నారు.

అందుకోసం గవర్నర్ ని ఆహ్వానించడానికి బడ్జెట్ గురించి ఆయనకు చెప్పడానికి బాబు రాజ్ భవన్ కి వెళ్లారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పాలన గురించి కూడా బాబు తెలియచేశారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో ఆర్ధిక పరిస్థితి గురించి కూడా గవర్నర్ తో పంచుకున్నారు అని అంటున్నారు. బడ్జెట్ గురించి పూర్తి సమాచారం కూడా గవర్నర్ కి ఇచ్చారని చెబుతున్నారు.

ఇక చూస్తే కనుక రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నవంబర్ రెండవ వారంలో మొదలవుతాయని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి అని అంటునారు. అంతే కాదు పూర్తి బడ్జెట్ తో ప్రభుత్వం సిద్ధంగా ఉండడం కూడా ఈసారి మరో విశేషం.

ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన చివరి నాలుగు నెలలకు సంబంధించి బడ్జెట్ ని ప్రవేశపెడతారు అని అంటున్నారు. ఇక నవంబర్ నెల 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ కి సంబంధించి చర్చ సాగనుంది అని అంటున్నారు. అలాగే ఏయే పధకాలను ప్రవేశపెట్టాలి వాటికి ఏ విధంగా కేటాయింపులు చేయాలి అన్నది కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తూంటే ఏపీలో నవంబర్ రెండవ వారం నుంచి శాసన సభా పర్వం మొదలు కానుంది. కూటమి ప్రభుత్వం తరఫున అంతా హాజరవుతారు. విపక్షంగా ఉన్న వైసీపీ నుంచి జగన్ సహా ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.