Begin typing your search above and press return to search.

మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ...బాబు ఏం చేస్తారు ?

వంద రోజుల పనితీరుని బేరీజు వేసి మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని రెడీ చేస్తామని బాబు చెబుతున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మంత్రుల పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 3:21 AM GMT
మంత్రుల ప్రోగ్రెస్  రిపోర్ట్ రెడీ...బాబు ఏం చేస్తారు ?
X

టీడీపీ కూటమిలో మంత్రులు అయ్యారు చాలా మంది. అందులో కొత్త వారికి చాలా మందికి చాన్స్ వచ్చింది. అలాగే యువతకు పెద్ద పీట వేశారు. ఇప్పటికి డెబ్బై రోజుల పాలన గడచింది. మరో ముప్పై రోజులలో వంద రోజులు పూర్తి అవుతాయి. మంత్రుల పనితీరు ఏమిటి అన్నది కూటమి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మధింపు చేస్తున్నారు.

వంద రోజుల పనితీరుని బేరీజు వేసి మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని రెడీ చేస్తామని బాబు చెబుతున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మంత్రుల పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. బాగా పనితీరు లేని మంత్రుల విషయంలో చంద్రబాబు ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది.

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం 24 మందితో ఏర్పాటు అయింది. అందులో పవన్ ని పక్కన పెడితే ఇద్దరు జనసేన ఒకరు బీజేపీ మంత్రి ఉన్నారు. ఇరవై మంది దాకా టీడీపీ మంత్రులు ఉన్నారు. దాంతో బాబు మొత్తం అందరి మంత్రుల పనితీరు మీద తాను మధింపు చేసి కూటమి పక్షాల అధినేతలకు ఆయా పార్టీ పార్టీల మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెబుతున్నారు. జనసేన మంత్రుల పనితీరు మీద రిపోర్టుని పవన్ కి ఇస్తామని చెప్పారు.

ఇక టీడీపీకి చెందిన ఇరవై మంది మంత్రుల నివేదికను తన వద్ద ఉంచుకుని బాబు వారి విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు. ఏ విధంగా దిశా నిర్దేశం చేస్తారు అన్న చర్చ అయితే నడుస్తోంది. చాలా మంది మంత్రులు కొత్త వారు దాంతో శాఖల పట్ల అవగాహన పెంచుకోవడం లోనూ కొందరు వెనకబడ్డారు అని అంటున్నారు. మరి కొందరు ఇప్పటికీ ఇంకా కొంత వెనకబడే ఉన్నారు అని అంటున్నారు. మరో వైపు కొందరు మంత్రులు వివాదాస్పదంగా ప్రకటనలు ఇస్తున్నారు అని బాబు ఆగ్రహిస్తు న్నారు అని అంటున్నారు.

అలాగే కొందరు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా చిత్తం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. వారి వల్ల పార్టీకి చెడ్డ పేరు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అంటున్నారు. అటువంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు మంత్రుల మీదనే ఉందని బాబు సుతి మెత్తగా మంత్రి వర్గ సమావేశంలో హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

ఏది మేఈన బాబు వంద రోజుల మంత్రుల పనితీరు మీద మార్కులు వేస్తారు అంటే చాలా మందిలో గుబులు మొదలైంది. ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయి. మార్కులు తగ్గిన వారి విషయంలో ఏ విధంగా బాబు వ్యవహరిస్తారు దిశా నిర్దేశం చేస్తారా లేక మరో విధంగా వ్యవహరిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద బాబు మార్క్ మార్కులు ప్రోగ్రెస్ రిపోర్టులు సరిగ్గా దీపావళి పండుగకు దగ్గర చేసి వస్తాయని అంటున్నారు.