Begin typing your search above and press return to search.

మోడీని పెద్ద సాయమే కోరనున్న బాబు

ఏపీకి ఇటీవల వచ్చిన వాయుగుండం యమ గండంగా మారింది. ఏపీ మొత్తం వానలకు వరదలకు తల్లడిల్లిపోయింది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 3:35 PM GMT
మోడీని పెద్ద సాయమే కోరనున్న బాబు
X

ఏపీకి ఇటీవల వచ్చిన వాయుగుండం యమ గండంగా మారింది. ఏపీ మొత్తం వానలకు వరదలకు తల్లడిల్లిపోయింది. ఏపీకి అతి ముఖ్యమైన సీజన్ ఖరీఫ్ ని ఈ భారీ వర్షాలు దెబ్బ తీశాయి. అంతే కాదు రోడ్లు దారుణంగా నాశనం అయ్యాయి. వివిధ శాఖలను చూస్తే కనుక ఎక్కడా తక్కువ నష్టం అయితే లేదు. అన్నీ వాన నీట కొట్టుకుని పోయాయి.

ఇక బెజవాడ వరదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అక్కడ ప్రతీ ఇంటికీ ప్రతీ మనిషికీ కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మొత్తం మీద ఏపీలో ప్రళయాన్ని తలపించేలా వచ్చి పడిన భారీ వానలు అతి పెద్ద దెబ్బ కొట్టాయని చెపాల్సి ఉంటుంది.

వానలు వరదల తరువాత ఏపీ పరిస్థితి ఏంటి ఈ నష్టం ఎంత అంటే ప్రభుత్వం ప్రాధమికంగా రూపొందించిన నివేద చూస్తే భారీగానే ఉంది. ఏపీకి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల దాకా నష్టం వచ్చింది అని తెలుస్తోంది. ఈ ప్రకృతి విపత్తు ఏపీని సర్వ నాశనం చేయడమే కాకుండా ఏకంగా 6, 800 కోట్ల రూపాయల దాకా ఆర్ధిక నష్టం కలిగించింది అని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి.

అదే సమయంలో ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఏకంగా 32 మంది మరణించినట్లు ప్రభుత్వ వర్గాల వివరాలు తెలియచేస్తున్నారు. ఇక సాధారణ ప్రజానీకం అయితే ఇళ్ళను పూర్తిగా పోగొట్టుకున్నారు. పంటల నష్టం చూస్తే కడుపు చెరువు అవుతుంది.

మొత్తం ఏపీలో లక్షా 69 వేల ఎకరాలలో సాధారణ పంటలను ఈ వాయుగుండం తో వచ్చిపడిన వానలు దెబ్బతీశాయి. అదే విధంగా మరో 18 వేల ఎకరాలలో ఉద్యాన వన పంటలకూ నష్టం ఏర్పడింది. ఈ మొత్తంలో రెండు లక్షల 34 వేలకు పైగా రైతులు చేతికి అందాల్సిన పంటను కోల్పోయి దెబ్బ తిన్నారు.

అదే విధంగా చూస్తే ఒక్కో శాఖలో వేల కోట్ల నష్టం సంభవించింది. రోడ్లు భవనాల శాఖకు 2,164.5 కఒట్ల రూపాయలు, జలవనరుల శాఖకు సంబంధించి రూ.1,568.6 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్లు, మత్స్య శాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపకశాఖలో రెండు వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు ప్రభుత్వం రూపొనించిన ప్రాథమిక నివేదిక వెల్లడిస్తోంది.

దీనినే కేంద్ర ప్రభుత్వానికి పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంటే ఏడు వేల కోట్ల రూపాయల దాకా భారీ నష్టం ఏపీకి జరిగింది. మరి కేంద్రం ఈ మొత్తం అందించి ఆదుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.