చంద్రబాబు ఆవేశం... అమరావతినే రాజధాని
ఏపీ సీఎం చంద్రబాబుకు అమరావతి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు చరిత్రలో నిలిచిపోయే ఒక సువర్ణ అవకాశం లభించింది
By: Tupaki Desk | 2 Sep 2024 3:41 PM GMTఏపీ సీఎం చంద్రబాబుకు అమరావతి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు చరిత్రలో నిలిచిపోయే ఒక సువర్ణ అవకాశం లభించింది. కొత్తగా రాజధాని నిర్మించే చాన్స్ అన్న మాట. నిజానికి అది అరుదుగా వస్తుంది. దేశాంలో కొన్ని రాష్ట్రాలు విడిపోయి కొత్త రాజధానులు ఏర్పాటు చేసుకున్నా అక్కడ ఇంతలా రాజధాని కోసం వివాదాలు రాలేదు.
ఆ మాటకు వస్తే ఏపీలో రాజధాని వివాదానికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. అది ఈనాటిది కానే కాదు, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవుతూనే రాజధాని వివాదం తలెత్తింది. అపుడు కాంగ్రెస్ మంచి పొజిషన్ లో ఉండడంతో రాయలసీమ వాసుల మాట నెగ్గింది. కర్నూల్ లో అలా రాజధాని వచ్చింది. ఇక 2014 నాటికి సీన్ మారింది. కాంగ్రెస్ ఏపీలో సోది లేకుండా పోయింది. వైసీపీ కొత్త పార్టీగా నిలిచింది.
దాంతో బలమైన ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఉండడంతో అమరావతిని రాజధానిగా చేశారు. అయితే అమరావతి రాజధాని విషయంలో ఎక్కువగా వచ్చిన వివాదాలు ఏంటి అంటే అది ముక్కారు పంటలు పండించే భూములు అని. అలాగే తడి నేల అని. అంతే కాదు అక్కడ నిర్మాణాలు భారీ ఎత్తున చేపట్టడం కూడా అంత క్షేమకరం కాదని, వరదల జోన్ అని.
అయినా సరే టీడీపీ కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. గతంలో అయితే ఏపీలోని మిగిలిన ప్రాంతాల వారికి ఏమైనా వేరే ఆలోచనలు ఉంటే ఉండొచ్చు కానీ ఇపుడు పదేళ్ళుగా రాజధాని లేకపోవడంతో ఏదో ఒకటి కట్టండి అన్న నిర్ణయానికి అయితే అంతా వచ్చేశారు. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు అమరావతి అంతా జై కొడుతున్నారు
అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజవాడ మొత్తం మునిగిపోయింది. విజయవాడ అంటే ఈ రోజు సిటీ కాదు, దానికి ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి నగరమే భారీ వర్షాలకు నీట మునిగీతే ఇక సింకింగ్ సాయిల్ గా ఉన్న అమరావతి సంగతి ఏంటి అన్న చర్చ మేధావులలోనూ సాగుతోంది. అయితే రాజధాని విషయంలో వైసీపీ మొదటి నుంచి టీడీపీ విధానాలను విభేదిస్తూ వస్తోంది.
దాంతో అమరావతి మునిగిపోయింది అంటూ ఆ పార్టీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు అవేశాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ మతి ఉండే చేసే పనులా అని ఆయన ఫైర్ అవుతున్నారు.
ఇక రీల్స్ లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలోని వరద నీరుతో ఫోతోలు పెడుతున్నారు. రీల్స్ లో ఏమి చూపిస్తే వ్యూస్ వస్తాయో ఆలోచించి కూడా పెట్టి ఉండేవారు ఉండొచ్చు. కానీ అమరావతి రాజధాని కడితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ తోనే చాలా మంది పెడుతున్నారు.
ఇది సహజంగానే టీడీపీ కూటమి పెద్దలకు మండిపోతుంది. చంద్రబాబు అయితే ఏకంగా మీడియా సమావేశంలో ఆవేశపడ్డారు. ఇది టీడీపీ పాలసీ అయినా ప్రజా కోణంలోనే అమరావతి రాజధానిని చూడాలని అంటున్నారు. ఇక దాదాపు యాభై ఏళ్ల క్రితం ఇంతటి స్థాయిలో ధాటీగా వర్షాలు పడ్డాయని రిపోర్టులు ఉన్నాయి. అలాంటి వర్షాలు మరోసారి కురిస్తే అమరావతి సహా కీలక ప్రాంతాల పరిస్థితి ఏంటి అన్న దానికి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉంటూ రాజధాని నిర్మాణం భుజానికి ఎత్తున్న చంద్రబాబు సమాధానం ఇవ్వాల్సిందే కదా అన్న మాట సైతం వినిపిస్తోంది.
ఇక చంద్రబాబు వైసీపీని గట్టిగా విమర్శించి ఉండవచ్చు. అమరావతి మునుగుతుందా అని కూడా గద్దించవచ్చు. వారు ప్రతిపక్షం కనుక ఇలాగే అంటారు, ఇదే తీరున విమర్శిస్తారు అని కూడా అనుకోవచ్చు. వైసీపీని కాసేపు పక్కన పెడితే అసలు చంద్రబాబు విజయవాడ వీధులలో పడవలలో తిరిగిన ఈ సందర్భం చూసినపుడు ఏమనుకోవాలి. దానిని ఎవరూ కాదనలేరు కదా అన్న చర్చ వస్తోంది
అందువల్ల ఒక బృహత్తరమైన రాజధాని నిర్మాణం చేపడుతున్నపుడు అది కూడా చరిత్రలో నిలిచే మహా నగరానికి శ్రీకారం చుడుతున్నపుడు చంద్రబాబు వంటి వారు ప్రజలకు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఏది చేసినా అందులో ప్రజా హితం అన్నది ఇమిడి ఉంటుంది. ప్రజా కోణంలోనే అన్నీ ఆలోచన చేయాలి. ఈ రోజున హైదరాబాద్ మునుగుతోంది. విజయవాడ మునిగింది. ఇవి రాక్ సాయిల్ మీద నిర్మాణాలు అయిన ప్రాంతాలు.
మరి సింకింగ్ సాయిల్ మీద నిర్మాణానికి తలపెడుతున్న అమరావతి విషయంలో వీటిని చూసినపుడు భయాలు సహజంగానే ఉంటాయి కదా. అందువల్ల ఈ విషయంలో రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఏపీకి పెద్దగా భవిష్యత్తు ఏపీని చూపించే నేతగా చంద్రబాబు వంటి పెద్దలు ఆవేశపడడం కంటే ప్రజలకు ఆలోచనలు పెంచేలా వివరణ ఇస్తే బాగుంటుంది అన్నదే అందరి సూచనగా ఉంది మరి.