బాబుకు కొత్త చిక్కు.. కేంద్రాన్ని ఒప్పిస్తారా....?
ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్‌లను కేంద్రం బదిలీ చేసింది.
By: Tupaki Desk | 15 Oct 2024 8:30 AM GMTఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త చిక్కు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్‌లను కేంద్రం బదిలీ చేసింది. వీరిలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సృజన సహా .. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లోతోటి శివశంకర్ వంటి వారు కూడా ఉన్నారు. వీరంతా తెలంగాణకు కేటాయించిన అధికారులని.. వీరిని తక్షణమే తెలంగాణకు పంపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఇక, తెలంగాణ నుంచి కూడా కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఏపీకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. వీరిలో ఆమ్రపాలి సహా సీనియర్ ఐపీఎస్‌లు అంజనీకుమార్ యాదవ్ వంటివారు ఉన్నారు. అయితే.. తెలంగాణలో చేస్తున్న వారు..అక్కడే ఉంటామని పేర్కొంటున్నారు. ఇదే మాట ఏపీలోనూ చెబుతున్నారు. కానీ, తెలంగాణలో పనిచేస్తున్నవారిని కొనసాగించాలంటే.. మరోసారి కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి అభ్యర్థ నపెట్టుకుని ఒప్పించాలి. కానీ, ఆయనకు ఇష్టం లేదు.
దీంతో బదిలీ అయిన వారు ఇస్తున్న వినతి పత్రాలుతీసుకుంటున్నారే తప్ప.. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంలో స్పందించలేదు. కానీ, ఏపీకి వచ్చేసరికి మాత్రం తాము వెళ్లేది లేదని.. మీ పాలన బాగుందని, మీ ఆధ్వర్యంలోనే చేస్తామని ఐఏఎస్‌లు చెప్పడంతో చంద్రబాబు కరిగిపోయారు. అంతేకాదు.. కేంద్రంతో తాను మాట్లాడి ఒప్పిస్తానని అన్నారు. అయితే.. ఇది అంత తేలికగా జరిగిపోయే విషయం కాదు. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రంబదిలీ చేసింది.
పైగా.. కూటమి సర్కారేఏపీలో ఉన్నా.. కనీసం మాట మాత్రంగా కూడా.. చంద్రబాబు ప్రభుత్వానికికేంద్రం నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నే బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కనుక రేపు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వస్తే.. ఇక్కడ నుంచి బదిలీ అయిన.. అధికారులను కూడా అక్కడి కి పంపించి తీరాలి. ఇది కోర్టు ఆదేశాల మేరకు చేయాల్సినపని. పోనీ.. ఈ కేసులో ఇంప్లీడ్ అవుదామన్నా.. కేంద్రమే కౌంటర్ వేయనప్పుడు.. ఏపీ ఇంప్లీడయ్యే అవకాశం లేదు. కాబట్టి.. ఐఏఎస్‌లకు చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చడం అంత ఈజీ అయితే కాదని అంటున్నారు పరిశీలకులు.