Begin typing your search above and press return to search.

మోడీ ఫుల్ హ్యాపీస్ : మరింతగా ఆ ఇద్దరూ

దేశంలో బీజేపీ రాజకీయం ఎలా ఉంది అంటే రెండు అడుగులు ముందుకు పడితే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Sep 2024 3:28 AM GMT
మోడీ ఫుల్ హ్యాపీస్ : మరింతగా ఆ ఇద్దరూ
X

దేశంలో బీజేపీ రాజకీయం ఎలా ఉంది అంటే రెండు అడుగులు ముందుకు పడితే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. కేంద్రంలో అధికారం మిత్రుల చలవతో దక్కింది. లోక్ సభ ఎన్నికల తరువాత వచ్చి పడిన పన్నెండు స్థానాలకు ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓటమి పాలు అయింది.

ఇక ప్రస్తుతం రెండు చోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరిన్ని క్యూలో ఉన్నాయి. ఎక్కడా డ్యాం ష్యూర్ గా గెలుస్తామని బీజేపీకి నమ్మకం అయితే లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తన బండిని కేంద్రంలో సాఫీగా అయిదేళ్ళ పాటు నడిపించగలదా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది.

కొంతలో కొంత ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి తోడ్పాటు అందిస్తున్నారు. అయితే బీహారీ బాబు నితీష్ కుమార్ మాత్రం తన పాలిటిక్స్ ఏంటో బీజేపీకే అర్థం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ళుగా గ్యాప్ పాటిస్తూ వస్తున్న నితీష్ కుమార్ బీజేపీని మోడీని తిరిగి పొగుడుతున్నారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం మీద మోడీని నితీష్ కుమార్ ప్రశంసించారు. మోడీ ఈజ్ గ్రేట్ అన్నారు. చిత్రమేంటి అంటే ఈ రామమందిరానికి ప్రాణ ప్రతిష్ట జరిగి కరెక్ట్ గా ఎనిమిది నెలలు అయింది. మరి నాడు సైలెంట్ గా ఉన్న నితీష్ ఇపుడు మాత్రం మోడీ గొప్ప వారు అంటున్నరు. మరి ఈ తేడా ఎందుకు వచ్చిందో అని అర్ధం కాక కమలనాధులు కొంచెం తలలు పట్టుకునే పరిస్థితి అంటున్నారు

ఇంకో వైపు చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ రూట్ లోకి వస్తున్నారు. ఆయన శ్రీవారి లడ్డూ ప్రసాదాలలో కల్తీ అంటూ ఒక ఇష్యూని రెయిజ్ చేశారు ఆ విధంగా ఆయన గట్టిగానే హిందూత్వ వాణిని వినిపిస్తున్నారు. వీటిని చూసిన వారు బీజేపీ ఫిలాసఫీ ఈ రెండు పార్టీలకు నచ్చిందా లేక తమ పార్టీలలో దానిని అడాప్ట్ చేసుకుని బీజేపీకే సవాల్ విసురుతున్నారా అన్నది కూడా చర్చిస్తున్నారు.

నిజానికి హిందువులు అధికంగా ఉన్న దేశం మనది. బీజేపీ హిందూత్వతోనే నెట్టుకుని వస్తున్న పార్టీ. ఆ పార్టీకి పోటీ ఇచ్చే పార్టీ మరోటి లేదు. అలా తన పొలిటికల్ ఫిలాసఫీని బీజేపీ దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తోంది.

ఇపుడు ఈ ఎమోషనల్ ఫిలాసఫీని అంది పుచ్చుకోవడానికి ఎన్డీయే మిత్రులే జోరు చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

బీజేపీ వరకూ చూస్తే అది బాగానే కలసి వచ్చింది. మరి ఇతర పార్టీలు ఎంత వరకూ తమ దోవలో ఈ నినాదాన్ని తీసుకుని పోగలవు. సక్సెస్ చేయగలవు అన్నది చూడాలి. అయితే బీజేపీ హిందూ ఓటు బ్యాంక్ చీలిక కూడా ఈ విధంగా జరుగుతుందా అది మిత్రుల వల్లనే జరుగుతుందా అన్నది కూడా ఒక హాట్ డిబేట్. పరిస్థితి అంతవరకూ వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు,

అలాగని చేతులు ముడుచుకోదు, దేశంలో ఎప్పటికీ హిందూత్వ బీజేపీదే. ఆ హక్కుభుక్తాలు ఆ పార్టీవే. ఎందుకంటే ఈ విషయంలో ఎందాకైనా వెళ్ళే పార్టీ బీజేపీయే తప్ప మరోటి లేదు. సరే ఏ వ్యూహం అయితేనేమి అటు బాబు టు నితీష్ బాబు ఇద్దరూ మోడీని గ్రేట్ అంటున్నారు. అది చాలు చాన్నాళ్ల పాటు చల్లగా కేంద్రాన్ని మోడీ ఏలడానికి అని కూడా అంటున్నారు.