Begin typing your search above and press return to search.

పిల్లలకు పెన్షన్ విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం!

ఈ విషయంలో చంద్రబాబు చాలా స్ట్రిక్ట్ గా, సిన్సియర్ గా ఉంటున్నారు! రానున్న మూడు నెలల్లో ప్రతీ పింఛన్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని చంద్రబాబు సూచించారు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 2:37 PM GMT
పిల్లలకు పెన్షన్ విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో నూటికి నూరు శాతం చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసిన హామీల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది "పెన్షన్స్" అని అంటారు. ఈ విషయంలో చంద్రబాబు చాలా స్ట్రిక్ట్ గా, సిన్సియర్ గా ఉంటున్నారు! రానున్న మూడు నెలల్లో ప్రతీ పింఛన్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని చంద్రబాబు సూచించారు.

చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... నకిలీ పింఛన్లు తొలగించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇస్తున్నంత పింఛన్లు మరే రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఒంటరి చిన్నారుల పెన్షన్ పై బాబు స్పందించారు.

అవును... పెన్షన్స్ ని ఏపీ ప్రభుత్వం కీలకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఇదే సమయంలో.. రాష్ట్రంలో తల్లితండ్రులను కోల్పోయిన ఒంటరి చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. నకిలీ పింఛన్లు తొలగించాలని సూచించారు.

తాజాగా రెండో రోజు జిల్లా కలెక్టర్ ల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు... వారు కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాల ఆధారంగానే కలెక్టర్ల పనితీరును పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలని అన్నారు.

దీంతో... ఇప్పటివరకూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు మాత్రమే పెన్షన్ వస్తుండగా.. తొలిసారిగా తల్లితండ్రులు లేని పిల్లలకు కూడా ప్రభుత్వం అండగా నిలబడి పెన్షన్ అందించడంపై హర్షం వ్యక్తం అవుతుందని అంటున్నారు.