Begin typing your search above and press return to search.

పిల్లలు కనండి అంటున్న బాబు...పెంచడమెలా అంటున్న జనాలు!

రష్యా లాంటి దేశాలు అయితె ఏకంగా శృంగార మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి పిల్లాలను కనమని చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   15 Nov 2024 3:28 AM GMT
పిల్లలు కనండి అంటున్న బాబు...పెంచడమెలా అంటున్న జనాలు!
X

పిల్లలను కనండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నినాదం అందుకున్నారు. నిజానికి చాలా కాలంగా బాబు ఇదే మాట చెబుతున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం పిల్లలను కనమన్నది ఒక స్లోగన్ గా మారుతోంది. రష్యా లాంటి దేశాలు అయితె ఏకంగా శృంగార మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి పిల్లాలను కనమని చెబుతున్నాయి.

అందుకు గానూ వారికి తగిన ఆర్ధిక ప్రోత్సాహాలను ప్రకటిస్తున్నాయి. చైనా జపాన్ ఇతర దేశాలూ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇక భారత దేశంలో చూస్తే దక్షిణాదిన జనాభా తగ్గిపోతోంది. దాంతో అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.

ఈ విషయంలో దూరదృష్టితో చంద్రబాబు వంటి వారు చెబుతున్న విషయాలు బాగానే ఉంటున్నాయి. దేశంలో కూడా గతంతో పోలిస్తే జనాభా బాగా తగ్గుతోంది. మరో వైపు జీవన ప్రమాణాలు పెరిగి ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దాంతో వృద్ద్ధ జనాభా కొన్నాళ్ళ నాటికి తయారవుతుందని యువ జనాభా వనరులు తగ్గిపోతాయని అంటున్నారు.

దీని మీదనే చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ పిల్లలను కనండి అని అంటున్నారు. దానికి గానూ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లాల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయరాదు అన్న నిబంధనలను తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం చట్ట సవరణ చేస్తూ అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టింది

ఈ సందర్భంగానే ఎక్కువ పిల్లలు ఉంటే అదే భాగ్యం అని బాబు చెప్పుకొచ్చారు. అయితే బాబు మాట బాగానే ఉందని కానీ ఆర్ధిక సమస్యలు బాగా ఎక్కువైన వర్తమానంలో చిన్న సంసారమే చింతలతో ఉంటే అధిక సంతానంతో వేగేది ఎలా అని జనాలు అంటున్నారు.

ఈ రోజున కాన్వెంట్ కి వెళ్లే పిల్లలకు సైతం లక్షలలో ఫీజులు అవుతున్నాయి. అదే విధంగా చూస్తే కనుక ఆర్ధిక భారాలు అన్ని రకాలుగా పెరిగి భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన నేపధ్యం ఉంది. ఇపుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. కుటుంబంలో ఇద్దరూ పనిచేయాల్సిందే.

ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి సాకేందుకు చూసుకునేందుకు కూడా వీలు ఉండదని అంటున్నారు. అదే విధంగా చూస్తే ఆర్ధికంగా అనేక సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. ఇతర దేశాలలో ఈ నినాదాలు పాలకులు ఇస్తూ దానికి అనుగుణంగా ఆర్ధిక ప్రోత్సాహకాలను కూడా ఇస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు

అదే ఏపీలో కూడా ఆర్ధికంగా చేయూతను ఇస్తామని వారికి అండగా ఉంటామని చెబుతూ కొత్త పధకాలను కనుక ప్రకటిస్తే మాత్రం బాబు అనుకున్నట్లుగా ఏపీ కూడా జనాభాంధ్రప్రదేశ్ గా మారడం కష్టం కాదని అంటున్నారు. మరి ఈ విషయాలను ఆలోచన చేయాలని అంటున్నారు.

ఈ విషయంలో ఏపీ పిల్లల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని అంటున్నారు. సో మరి బాబు ఇచ్చిన స్లోగన్ మంచిదే కానీ దాన్ని సక్సెస్ చేయడం ప్రభుత్వం చేతిలోనే ఉంది అని అంటున్నారు.