Begin typing your search above and press return to search.

బాబు లోకేష్ ఇద్దరూ లేని వేళ ఆయనేనా ?

మరి చంద్రబాబు లోకేష్ ఇద్దరూ ఒకేసారి ఏపీ నుంచి దూరంగా దావోస్ టూర్ కి వెళ్తున్న వేళ నాలుగైదు రోజుల పాటు ఏపీలో పాలనా వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   15 Jan 2025 3:30 PM GMT
బాబు లోకేష్ ఇద్దరూ లేని వేళ ఆయనేనా ?
X

ఏపీలో ఇద్దరు కీలక అధినాయకులు కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో ఉండరు. టీడీపీ ప్రభుత్వానికి రధ సారధి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, ఆయన కుమారుడు కీలక శాఖలను మంత్రిగా చూస్తున్న నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24 వరకూ ఏపీలో ఉండరు. ఈ ఇద్దరూ మరి కొందరు మంత్రులతో పాటు ముఖ్యమైన అధికారులతో కలసి దావోస్ టూర్ కి వెళ్తున్నారు.

దావోస్ లో జరిగే అంతర్జాతీయ ఎకనామికల్ ఫోరం సదస్సులో చంద్రబాబు లోకేష్ పాల్గొంటున్నారు. ఈ సదస్సులో ఈ ఇద్దరితో పాటుగా ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భరత్, అదే విధంగా సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సీఎం భ‌ద్ర‌తా అధికారి శ్రీనాథ్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈవో సాయి కాంత్ వర్మ, కుప్పం ప్రాంతీయ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి వికాస్ మర్మత్ దావోస్ వెళ్తున్నారు. అంటే ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి కీలక అధికారులు దావోస్ బృందంలో ఉంటారన్న మాట.

మరి చంద్రబాబు లోకేష్ ఇద్దరూ ఒకేసారి ఏపీ నుంచి దూరంగా దావోస్ టూర్ కి వెళ్తున్న వేళ నాలుగైదు రోజుల పాటు ఏపీలో పాలనా వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు అన్న చర్చ సాగుతోంది. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో నంబర్ టూ అన్నది అయితే స్పెసిఫిక్ గా ఎవరూ లేరు. అయితే సీనియర్ మంత్రులు ఉన్నారు. అలాగే కీలక శాఖలను చూసే మంత్రులు ఉన్నారు.

వారితో పాటుగా సీఎం తరువాత వెంటనే వినిపించే పేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి వీరిలో ఎవరు పాలనపరంగా వ్యవహారాలు చూస్తారు అన్న చర్చ సాగుతోంది. అయితే గతంలో అంటే దశాబ్దం కాలం క్రితం అయితే సీఎం ఔటాఫ్ స్టేషన్ వెళ్తే చూసుకునేందుకు ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించేవారు. ఇపుడు అంతా డిజిటల్ యుగం సాగుతోంది.

దాంతో ఎవరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నుంచే ఆపరేట్ చేసే సదుపాయం ఉంది. జగన్ కూడా సీఎం గా ఉంటూ రెండు సార్లు విదేశీ పర్యటనలు చేశారు ఆయన ఎక్కువ రోజులు అప్పట్లో విదేశాలలో ఉన్నారు. అయినా పాలన సాఫీగానే సాగిపోయింది. అంతే కాదు ఎవరినీ జగన్ పాలన వ్యవహారాలు చూసుకోమని అప్పగించినది కూడా లేదు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే గతంలో ఆర్ధిక మంత్రులు దావోస్ టూర్ కి వెళ్ళేవారు. అలా యనమల రామకృష్ణుడు బాబుతో దావోస్ టూర్ కి వెళ్లారు. కానీ ఈసారి చూస్తే ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్ళడం లేదు, ఆయన పేరు లిస్ట్ లో లేకపవడం విశేషం. అయితే పయ్యావులకు ఏపీలోనే ఆర్ధి శాఖలో కీలకమైన పనులు ఉన్నాయని అంటున్నారు. దాంతోనే ఆయన ఉండిపోయారు అని చెబుతున్నారు.

ఏది ఏమైనా బాబు దావోస్ నుంచే దైనందిన పాలనా వ్యవహారలు చక్కబెడతారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన దావోస్ లో పెట్టుబడులు ఏ ఏ రంగాల నుంచి సేకరించాలి అన్న దాని మీద కూడా ఒక అవగాహనతో ఉన్నారని అంటున్నారు. ఏపే ఏ రంగాలలో పెట్టుబడులు పెడితే వారికి ఏ రకమైన ప్రోత్సాహం అందిస్తుంది అన్నది కూడా బాబు ఒక స్పష్టమైన అజెండాను సిద్ధం చేసుకునే దావోస్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. మొత్తానికి బాబు లేని రోజులలో ఏపీని ఆయనే రిమోట్ తో నడిపిస్తారు అన్నది తెలుస్తున్న విషయంగా ఉంది.