Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు పెన్ష‌న్ 'టెన్ష‌న్‌' ...!

అయితే.. ఇప్పుడు కేంద్రం జాతీయ పింఛ‌ను ప‌థ‌కాన్ని(ఎన్‌పీఎస్‌) తీసుకువ‌చ్చింది. దీనిని అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌ను కూడా కోరింది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 12:30 PM GMT
చంద్ర‌బాబుకు పెన్ష‌న్ టెన్ష‌న్‌ ...!
X

సీఎం చంద్ర‌బాబుకు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అదే ఉద్యోగుల‌కు అమలు చేయాల్సిన పింఛ‌న్ వ్య‌వ‌హా రం. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. సీపీఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీనిని ర‌ద్దుచేయ‌లేక పోయినా.. జ‌గ‌న్ స‌ర్కారు.. జీపీఎస్‌ను తీసుకువ‌చ్చింది. ఇది ప్ర‌భుత్వ పెన్ష‌న్ ప‌థ‌కం. దీనిలో ఉద్యోగుల బేసిక్ పేపై 50 శాతం సొమ్మును పింఛ‌నుగా ఇస్తారు. వారి అనంత‌రం.. వారి పై ఆధార‌ప‌డిన వారికి 60 శాతం పింఛ‌న్ పింఛ‌నులో భాగం ఇస్తారు.

ఇత‌ర విష‌యాలు కూడా కామ‌న్‌గా ఉంటాయి. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. ఉద్యోగులు ఆందోళ‌న‌లు చేశారు. త‌మ‌కు ఓల్డ్ పెన్ష‌న్ స్కీంను అమ‌లు చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీనిని ఇవ్వ‌లేమ‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. ఇదే ఎన్నిక‌ల‌స‌మ‌యంలో వైసీపీకి ప్రాణ‌సంక‌టంగా మారిపోయింది. ఇక‌, సీపీఎస్ విష‌యంలో ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ హామీ ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు కేంద్రం జాతీయ పింఛ‌ను ప‌థ‌కాన్ని(ఎన్‌పీఎస్‌) తీసుకువ‌చ్చింది. దీనిని అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌ను కూడా కోరింది. ఇది ఐచ్ఛికం. అంటే.. అవ‌కాశం ఉంటే అమ‌లు చేయొచ్చు. లేదా త‌మకు న‌చ్చిన ప‌థ‌కాన్ని ఎంచుకునే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఈ ప‌థ‌కంపై దృష్టి పెట్టారు. అయితే.. ఇక్క‌డ చిత్రంఏంటంటే. కేంద్రం అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌.. జాతీయ పింఛ‌ను ప‌థ‌కం.. అచ్చం జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన జీపీఎస్‌ను కాపీ కొట్టిందే!

ఇది నిజం కూడా. ఈ విష‌యాన్ని కేంద్ర‌మే చెప్పింది. ప‌లు రాష్ట్రాల్లో తీసుకువ‌చ్చిన ప‌థ‌కాల నుంచి ఎన్ పీఎస్‌ను తీసుకువ‌చ్చామ‌ని తెలిపింది. దీనిలో చూస్తే.. అన్నీ కూడా జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన ప‌థ‌కంలోని ప‌లు అంశాలు ఉండ‌డం క‌నిపిస్తోంది. దీనినివైసీపీ స్వాగ‌తించింది. తాము చెప్పిందే కేంద్రం చేస్తోంద‌ని కూడా పేర్కొంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఎన్ పీఎస్‌ను అమ‌లు చేస్తే.. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన విధానాన్ని అమ‌లు చేసిన‌ట్టు ఉంటుంది త‌ప్ప‌.. త‌మ ముద్ర‌ప‌డ‌దు. అలా కాకుండా.. తాము కొత్త‌గా తీసుకువ‌చ్చినా.. ఉద్యోగులు ఒప్పుకొంటారో లేదో న‌న్న బెంగ వెంటాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.