Begin typing your search above and press return to search.

డ్రోన్ లతో దేశంలోనే అతిపెద్ద ఈవెంట్... సరికొత్త ప్లాన్స్ తో ఏపీ సర్కార్!

డ్రోన్ టెక్నాలజీ, ఆవిష్కరణల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 9:27 AM GMT
డ్రోన్ లతో దేశంలోనే అతిపెద్ద ఈవెంట్...  సరికొత్త ప్లాన్స్  తో ఏపీ సర్కార్!
X

డ్రోన్ టెక్నాలజీ, ఆవిష్కరణల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలోని అతిపెద్ద డ్రోన్ సమిట్, ఎక్స్ పో ను రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టిన బాబు... 5,500 డ్రోన్లతో అద్భుతమైన ప్రదర్శన జరగనుందని.. దీనికోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.

అవును... డ్రోన్స్ టెక్నాలజీ వినియోగంలో ఏపీని దేశానికి దిక్సూచిగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో వీటి తయారీ కేంద్రంగా కూడ రాష్ట్రాన్ని నిలపాలనే ఉద్దేశ్యంతో ముందడుగు వేస్తోందని అంటున్నారు. 2030 కల్లా డ్రోన్స్ తయారీకి కేంద్రంగా భారత్ ను నిలపాలనే లక్ష్యంతో కేంద్రం ఉంది.

పైగా... 14 రంగాల్లో డ్రోన్స్ వినియోగాలనికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో... ఈ అవకాశాన్ని అందరికంటే ముందే అందిపుచ్చుకోవాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22, 23 తేదీల్లో మంగళగిరిలోని సీకే కన్వెషన్ లో రెండు రోజులపాటు జాతీయస్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.

ప్రధానంగా వాణిజ్యం పరగంగా డ్రోన్ల వినియోగం పెంచడం లక్ష్యంగా ఈ సదస్సు జరగనుందని తెలుస్తోంది. ఈ డ్రోన్ సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా కృష్ణా తీరంలో భారీ ప్రదర్శనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. ఇప్పటివరకూ దేశంలో అత్యధికంగా 2వేల డ్రోన్స్ తోనే షో నిర్వహించగా.. ఏపీ ఏకంగా 5,500 డ్రోన్స్ తో మెగా షో నిర్వహించనుంది.

ఈ సందర్భంగా స్పందించిన ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్... ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతిలో జరిగే డ్రోన్ సమ్మిట్ దేశంలోనే అతిపెద్ద ఈవెంట్ అని అన్నారు. డ్రోన్ల తయారీ, ఇన్నోవేషన్ గురించి చంద్రబాబు ఒక పాలసీని తయారు చేస్తున్నరని తెలిపారు. ఇటీవల వరదల సందర్భంలోనూ డ్రోన్లను సహాయ చర్యల్లో వినియోగించడం జరిగిందని తెలిపారు.