చంద్రబాబు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.. మంచిదేనా..!
ఆయన ఇటు అధికారులు చెప్పింది విన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పింది కూడా.. విన్నారు. మధ్యే మార్గంగా నిర్ణయాలు తీసుకున్నారు.
By: Tupaki Desk | 29 Oct 2024 4:30 PM GMTరాష్ట్రాలలో అయినా.. కేంద్రంలో అయినా.. ప్రభుత్వాలు రెండు రకాలుగా పాలనను సాగిస్తాయి. 1) బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్, 2) పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. ఈ రెండు కూడా.. ప్రభుత్వాలకు ముఖ్యమే. రెండింటినీ.. సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్లిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు. ఆయన ఇటు అధికారులు చెప్పింది విన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పింది కూడా.. విన్నారు. మధ్యే మార్గంగా నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే..తాను చేయాలని అనుకున్నది మాత్రం చేసేశారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్ మెంటు వంటివి వచ్చాయి. ఈ రెండిటినీ.. అటు పొలిటికల్‌గా నాయకులు అంగీకరించలేదు. ఎందుకం టే.. కేంద్రంలోఉన్నది అప్పట్లో కాంగ్రెస్సే. ఈ రెండు పథకాలు ఆర్థికంగా గుదిబండగా మారతాయని.. తాము నిధులు ఇవ్వమని చెప్పింది. కానీ, వైఎస్ వెనక్కి తగ్గలేదు. ఒకరిద్దరు అధికారులు బాగుందన్నా.. మెజారిటీ అధికారులు కూడా ఈ పథకాలను వ్యతిరేకించారు. అయినా.. వైఎస్ అమలు చేశారు.
అదేసమయంలో అదికారులు చెప్పిన విషయాలను కూడా కొన్ని సందర్భాల్లో పరిగణనలోకి తీసుకున్నా రు. నాయకులు చెప్పిన దానిని కూడా అనుసరించారు. ఇరు పక్షాలను సంతృప్తి పరిచారు. ఇదే.. తర్వాత ఎన్నికల్లో వైఎస్‌ను విజయతీరాలకు చేర్చింది. ఇక, చంద్రబాబు విషయాన్ని తీసుకుంటే.. 1995-2004 వరకు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేశారు.
అప్పట్లో అది అవసరం. నాయకులు ఏం చెప్పినా..విన్నారు. అలానే చేశారు. అధికారులపై ఆగ్రహాలు వ్యక్తం చేయడం.. తర్వాత ఎన్నికల్లో వారు తిరగబడిన విషయం తెలిసిందే. కట్ చేస్తే.. ఇది అంతగా బాబుకు ప్రయోజనం చేకూర్చలేదు. దీంతో 2014-19 మధ్య బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ కు అవకాశం ఇచ్చారు. అంటే.. పార్టీ నాయకులను ఎవరినీ దరి చేరనివ్వలేదు.
అధికారులు చెప్పిందే చంద్రబాబు చేశారు. ఇది పార్టీలో ఇబ్బందులకు దారి తీసింది. ఫలితంగా ఇది కూడాఓటమికి దారితీసింది. ఇక, ఇప్పుడు మరోసారి.. చంద్రబాబు గత అనుభవాలను మరిచిపోయారో.. లేక.. మరేమో తెలియదు కానీ, మరోసారి.. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాజకీయంగానే పాలన చేస్తానని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులకు తరచుగా అప్పాయింట్ మెంట్లు ఇస్తున్నారు. వారి కోరికలు కూడా నెరవేరుస్తున్నారు. అందుబాటులో ఉంటున్నారు. పార్టీ కార్యాలయానికి కూడా వెళ్తున్నారు.
దీనివల్ల అధికారులు స్వేచ్ఛగా పనులు చేసేందుకు అవకాశం లేకుండా పోయిందనేది వాస్తవం. నాయకులు చెప్పినట్టు వారు చేయాల్సి వస్తోంది. కొన్ని కొన్ని చోట్ల పోలీసులు ఎఫ్ఐఆర్‌లను కూడా మార్చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజకీయ పాలన కంటే.. అటు అధికారులు, ఇటు నాయకులను సమపాళ్లలో పాలనలో మిళితం చేయడం ద్వారా.. సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. అంటే.. ఎక్కడ తగ్గాలో.. అక్కడ తగ్గి.. ఎక్కడ గెలవాలో అక్కడ గెలిస్తే.. పాలన రెండు పట్టాలపై సమాంతరంగా ప్రయాణిస్తుంది.