Begin typing your search above and press return to search.

జమిలీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   23 Nov 2024 4:49 AM GMT
జమిలీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై చర్చ తీవ్రంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. హర్యానా, జమూకశ్మీర్ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ చర్చ మరింత విపరీతంగా జరిగింది. ఈ విషయంలో మోడీ ముందుకు వేగంగా కదులుతున్నారనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... దేశంలో జమిలీ వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే సాధారణ ఎన్నికలు ఉంటాయని.. ముందస్తు ఎన్నికలు ఏవీ ఉండవని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వాస్తవానికి జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ పెద్దలు తీవ్ర ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ నివేదిక సమర్పించింది. హర్యానాలో విక్టరీ... జమ్మూకశ్మీర్ లో మెరుగైన ఫలితాలు.. ఇక మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకూలంగా వచ్చాయి.

దీంతో... ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా లోక్ సభ కు మాత్రమే ఎన్నికలు జరిగితే అది జమిలీ ఖాతాలోకి ఎలా వస్తుంది? అలా అని జమిలీ నుంచి ఏపీని పక్కన పెట్టడం సాధ్యం కాదు కదా? అంటే... జమిలీ విషయంలో ఎన్డీయే పెద్దలు వెనక్కి తగ్గుతున్నట్లు బాబుకు సమాచారం ఉందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.

తాజాగా అసెంబ్లీలో తన కార్యాలయ వద్ద విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా బాబు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా "విజన్ డాక్యుమెట్ -2047" అమలుపై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉంటుందని తెలిపారు. విజన్ లక్ష్య సాధన కోసం ఆర్థిక వనరుల సమీకరణకు కూడా వినూత్నపంథాను అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.