మహిళా మంత్రులపై చంద్రబాబుకు సమాచారం.. విషయం ఇదే..!
అయితే.. ఫిర్యాదులు రావడం లేదు. కానీ, పనితీరు విషయంలో ఎదురు దాడిమాత్రమే చేస్తున్నట్టు కొంత చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 17 Dec 2024 9:30 AM GMTచంద్రబాబు కేబినెట్ అంటేనే పనితీరుకు కొలతలు వేసుకునే విషయం తెలిసిందే. ఏం చేసినా.. దానికి ఒక ప్రాతిపదిక.. ఉంటుంది. ఏదో వచ్చాం..ఏదో వెళ్లాం.. అంటే కుదరదు. వాస్తవానికి వైసీపీ హయాంలో ఇలానే జరిగింది. మంత్రులు ఉన్నా.. వారు ఏం చేస్తున్నారో.. వారికి ఎలాంటి అధికారాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భాలు కూడా వైసీపీలో ఉన్నాయి. తానేటి వనిత నుంచి అనిల్‌కుమార్ యాదవ్ వరకు.. కూడా.. అందరి పరిస్థితి ఇంతే.
కనీసం ఇప్పుడు ఇప్పుడు చాలా మంది మంత్రులు సమీక్షలు, సమావేశాలు, మీడియాతో భేటీలు నిర్వహి స్తున్నారు. కానీ, వైసీపీ హయాంలో ఇలాంటివేవీ లేకుండా పోయాయి. దీంతో వైసీపీ హయాంలో రెండు సార్లు మంత్రి వర్గాన్ని విస్తరించినా.. తమదైన ముద్ర అయితే వేయలేక పోయారు. ఇక, చంద్రబాబు విషయానికి వస్తే.. మాత్రం ఈ తరహా పరిస్థితి ఉండదు. వారు ఏం చేస్తున్నారన్న మానిటరింగ్ సీఎం చంద్రబాబు స్థాయిలోనే చూసుకుంటారు.
అంతేకాదు.. ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. మంత్రుల వ్యవహార శైలిపైనా ఒకరకంగా.. అప్రకటిత నిఘా కొనసాగుతుంది. ఎలాంటి ఆరోపణలు వచ్చినా వెంటనే ఖండించే అలవాటు చంద్రబాబుకు ఉంది. ఈ క్రమంలో మహిళా మంత్రులుగా ఉన్న ముగ్గురి విషయంలో చంద్రబాబు ప్రత్యేకంగా చూస్తున్నారు. వీరి లో సంధ్యారాణి.. వివాదాలకు తావులేకుండా ముందుకు సాగుతున్నారని సీఎం చంద్రబాబు భావిస్తున్నా రు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి.
ఇక, మంత్రి సవిత విషయంలో నియోజకవర్గంలో చోటు చేసుకున్న చిన్నపాటి పరిణామాలపై పార్టీ పరంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆమె కలివిడిగా ఉండడం లేదని.. నియోజకవర్గానికి వచ్చినా తమకు సమాచారం ఇవ్వడం లేదని సీనియర్లు చెబుతున్నారు. అదేవిధంగా మంత్రి అనిత విషయంలోనూ ఇదే తరహా ఫిర్యాదులు ఉన్నా.. సవితపై వస్తున్న స్థాయిలో అయితే.. ఫిర్యాదులు రావడం లేదు. కానీ, పనితీరు విషయంలో ఎదురు దాడిమాత్రమే చేస్తున్నట్టు కొంత చర్చ సాగుతోంది. ఏదేమైనా మహిళా మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.