జమిలి 2029లోనే.. చంద్రబాబు పక్కా సేఫ్.. !
ఏపీ సీఎం చంద్రబాబు సేఫ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికల వ్యవహారంపై స్పష్టత వచ్చింది.
By: Tupaki Desk | 17 Dec 2024 7:15 AM GMTఏపీ సీఎం చంద్రబాబు సేఫ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికల వ్యవహారంపై స్పష్టత వచ్చింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు జమిలి ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అయితే.. ఈ ప్రకటన తర్వాత.. వైసీపీ పుంజుకునే ప్రయత్నం చేసింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్.. జమిలి వస్తుందని.. పార్టీ నాయకులు రెడీ కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కూటమి సర్కారు వైఫల్యాలపై ఆయన నిరసనలకు కూడా పిలుపునిచ్చారు.
ఇక, జగన్ ప్రకటనతో అందరూ.. జమిలి వచ్చేస్తుందని అనుకున్నారు. 2027-28 మధ్యలోనే అంటే.. కూట మి సర్కారు కాల పరిమితి ఇంకా ఏడాది సమయం ఉందనగానే.. జమిలి ఎన్నికలు వచ్చేస్తాయని అనుకు న్నారు. ఇక, వైసీపీ పుంజుకుంటుందని కూడా లెక్కలు వేసుకున్నారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి, ఇటీవల వైసీపీ రాజీనామా చేసిన అవంతి శ్రీనివాసరావు కూడా చెప్పుకొచ్చారు. జమిలి వస్తున్నందునే.. తమ నాయకుడు నిరసనలకు పిలుపునిచ్చారని అన్నారు.
కానీ, సీఎం చంద్రబాబు మాత్రం 2019లోనే జమిలి ఎన్నికలు వుంటాయని ఇటీవల చెప్పారు. కానీ, దీనిపై అనేక సందేహాలు ముసురుకున్నాయి. 2019 అయితే.. చంద్రబాబుకు అనుకూలం కాబట్టి(అంటే తన ఐదేళ్ల పాలన సంపూర్ణం అవుతుంది) ఆయన అలా చెప్పారంటూ వ్యాఖ్యానాలు వినిపించాయి. కేంద్రంలోని మోడీ సర్కారు తనకు అనుకూలంగా ఉన్న సమయాన్ని చూసుకుని అడుగులు వేస్తుందని అన్నారు. ఈ క్రమంలో 2027-28 మధ్యే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ నడిచింది.
అయితే.. ఇప్పుడు పార్లమెంటు పరంగా చూసుకుంటే.. జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టిన తర్వాత.. దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదిస్తారు. దీనిపై అధ్యయనానికి ఏడాది సమయం ఉంటుంది. ఆ తర్వాత.. రాష్ట్రాలకు తీర్మానాలు చేయాలని సూచనలు చేస్తారు. అనంతరం.. ఉభయ సభల్లోనూ చర్చించి.. రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు మరో రెండేళ్ల సమయం వస్తుంది. అంటే.. మొత్తంగా 2028 చివరి నాటికి ఈ బిల్లు ఆమోదం పొంది .. చట్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి 2029లోనే ఎన్నికలు రానున్నాయని జాతీయ మీడియా వర్గాల చర్చ. దీంతో సీఎం చంద్రబాబు సేఫ్ అయినట్టే కదా.. అంటున్నారు.