మళ్లీ ఎన్నికలు ఉన్నాయి జాగ్రత్త: బాబు హాట్ కామెంట్స్ వెనుక!
అంతేకాదు.. ''ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. మనం కూటమి గానే పోటీ చేస్తున్నాం.
By: Tupaki Desk | 20 Oct 2024 8:25 AM GMTక్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు.. తమ తమ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నారు కాబట్టి.. ఇప్పుడు అంతో ఇంతో సంపాయించుకుం టున్నారని సరిపుచ్చుకోవచ్చు. తప్పయినా ఒప్పయినా.. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఖర్చులు పెరుగుతు న్నందున తమ్ముళ్ల ముందుచూపును పార్టీ సమర్థించలేక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఇప్పుడు మరో సమస్య వచ్చింది. దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికలను చూపిస్తున్నారు.
ఏంటా సమస్య..
ఇసుక, మద్యం విషయాల్లో జనసేన సహా బీజేపీ నాయకుల పాత్ర కూడా ఉంది. దూకుడుగా ఉన్న నాయ కులు.. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుంటున్నారు. అయితే.. ఇది తమ్ముళ్లకు-జనసేన, బీజేపీ నా యకులకు మధ్య విభేదాలను పెచ్చరిల్లేలా చేసింది. అంటే.. ఆధిపత్యం.. ఆర్థికం.. ఇలా అనేక విషయా లు కూటమిలో నేతల మధ్య పెరుగుతున్నాయి. ఈ విషయాలు నెమ్మదినెమ్మదిగా బయటకు వస్తున్నా యి. ఈ విషయంలో టీడీపీ నాయకుల దూకుడే ఎక్కువగా ఉందని చంద్రబాబుకు కూడా తెలిసింది.
దీంతో ఆయన తనదైనశైలిలో తమ్ముళ్లను వారించే ప్రయత్నం చేస్తున్నారు. ''మళ్లీ ఎన్నికలు ఉన్నాయి.. జాగ్రత్త'' అని చంద్రబాబు హెచ్చరించారు. అంతేకాదు.. ''ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. మనం కూటమి గానే పోటీ చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. దూకుడు తగ్గించుకుంటే మంచిది!'' అని నాయకులకు పేరు చెప్పకుండానే యునానిమస్‌గా హెచ్చరికలు జారీ చేశారు. అంటే.. దీనిని బట్టి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపైనే కాదు.. పార్టీలతో కలివిడిగా ఉండాల్సిన అవసరం కూడా చెప్పారు.
కూటమికి బీటలు వస్తే.. అది వైసీపీకి ప్రధాన ఆయుధంగా మారుతుందన్నది చంద్రబాబు చెప్పుకొచ్చారు. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఏం జరిగినా.. కూటమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అంటున్నారు. అందుకే మీరంతా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలని వారిని పరోక్షంగా హెచ్చరించారు. తద్వారా.. క్షేత్రస్థాయిలో ఆధిపత్య, ఆర్థిక రాజకీయాలకు తమ్ముళ్లు దూరంగా ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన. మరి ఏం చేస్తారో చూడాలి.