'గన్ను పెట్టి ఆస్తులు రాయించుకున్నారు'... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అవును... గత కొన్ని రోజులుగా కాకినాడ పోర్టు కేంద్రంగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 Dec 2024 1:33 PM GMTప్రస్తుతం కాకినాడ పోర్టు చుట్టూ ఏపీ రాజకీయం హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా అత్యంత దారుణాలు జరిగాయంటూ చంద్రబాబు కీలక ఆరోపణలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా... వైసీపీ టార్గెట్ గా నిప్పులు చెరిగారు.
అవును... గత కొన్ని రోజులుగా కాకినాడ పోర్టు కేంద్రంగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మీడియాతో మాట్లాడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... కాకినాడ పోర్టు సెజ్ లో బలవంతంగా వాటాలు రాయించుకున్నారని.. తుపాకీ పెట్టి బలవంతంగా ఆస్తులు తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా... అవినీతి గురించి విన్నాం కానీ, వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు చరిత్రలో లేవని అన్నారు. ఇప్పుడు తెరపైకి వచ్చిన ఇలాంటి తరహా నేరాల పట్ల ఏమి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నమని చెబుతూ.. గత ప్రభుత్వ హాయాంలో ఆస్తులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.
ప్రధానంగా... గత ప్రభుత్వ హయాంలో జరిగిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని చెప్పిన చంద్రబాబు.. కాకినాడ సెజ్, కాకినాడ పోర్టులో ఏ విధంగా బెదిరించి అధికారాన్ని దుర్వినియోగం చేసి వాటాలు దక్కించుకున్నారో చంద్రబాబు వివరించారు! ఏపీ చరిత్రలోనే ఇలాంటి దురాగతాలు ఎక్కడా చూడలేదని విమర్శించారు.
గతంలో అధికారన్ని అడ్డు పెట్టుకుని పెట్రేగిపోయారని ధ్వజమెత్తిన చంద్రబాబు.. అరవిందో గ్రూపు ఏ విధంగా వాటా దక్కించుకుందో చూస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి నేరాలు దేశ చరిత్రలోనే లేవని అనడం గమనార్హం. ఇక భూ వివదాల ఫిర్యాదులు టీడీపీ కార్యలాయానికి ఎక్కువగా వస్తున్నాయని.. వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామని చంద్రబాబు!