Begin typing your search above and press return to search.

ఎందుకీ ప‌రిస్థితి వ‌చ్చింది? చంద్ర‌బాబు బిగ్ డౌట్‌!!

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారుల అలసత్వంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 10:30 AM GMT
ఎందుకీ ప‌రిస్థితి వ‌చ్చింది?  చంద్ర‌బాబు బిగ్ డౌట్‌!!
X

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారుల అలసత్వంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగినా.. బాధితులందరికీ సరిపడేలా ఆహరం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జరుగుతున్న జాప్యంపై సీరియస్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా తాను పర్యటిస్తున్నా .. అధికారులు మాత్రం ఇంకా గతంలోమాదిరి మొద్దు నిద్ర పోతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిరహించారు.

బాధితులకు అందుతున్న సహాయంపై ఆరా తీశారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో కొంతమంది అధికారుల తీరుతో ఆహారాన్ని సకాలంలో అందించడంలో ఆలస్యం అయిందని తెలుసుకున్న చంద్రబాబు.. ఉద్దేశపూర్వకంగానే అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామాల‌పై ఆయ‌న తీవ్రంగానే స్పందించారు. భ‌విష్య‌త్తులో ఇలా చేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు. గత ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులుగా పేరొందిన కొంతమంది వీఆర్ లో ఉన్న అధికారులను బందోబస్తులో భాగంగా సహాయక చర్యలో భాగంగా విధులు నిర్వహించేలా డ్యూటీ వేశారు.

అయితే.. వారే ప‌నిచేయడం లేద‌న్న‌ది ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌గా ఉంది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో దీనిని భ‌రించ‌క త‌ప్ప‌దు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఈ రాజకీయాలు ఏంటని కూడా చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. కానీ, వాస్త‌వానికి చంద్ర‌బాబు మాదిరిగా ప‌నిచేసే అధికారుల త‌రం వేరు.. ఇప్పుడున్న వారి ప‌రిస్థితి వేరు ఈ తేడాను చంద్ర‌బాబు గుర్తించ‌లేక పోతున్నారు. ఆయ‌న మాదిరిగా ప‌నిచేసే ల‌క్ష‌ణం ఇప్పుడున్న‌వారిలో క‌నిపించ‌డం లేదు. దీనికి తోడు పోటెత్తిన వ‌ర‌ద కార‌ణంగా.. బాధితులు చెట్టుకొక‌రు.. పుట్ట‌కొక‌రు.. అన్న చందంగా విడిపోయారు. వీరికి సాయం అందించ‌డంలోనూ.. ఇబ్బందులు ఎదుర‌వుతున్నా యి. ఇదే అస‌లు కార‌ణం. ఈచిన్న సున్నిత‌మైన తేడాను గుర్తించ‌గ‌లిగితే అంతా సాఫీగానే సాగిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.