తమ్ముళ్ల బాధ ఇదే.. చంద్రబాబు షాకింగ్ డెసిషన్.. !
ఈవ్యవహారం సీఎం చంద్రబాబు వరకు కూడా వెళ్లింది.
By: Tupaki Desk | 23 Oct 2024 2:30 AM GMTవైసీపీ హయాంలో నాయకులు ఇసుక, మట్టి వంటివాటిలో జోక్యం చేసుకున్నారు. దీంతో ఈ ప్రభావం పార్టీ పై పడింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో లెక్కలు మారిపోయాయి. ఇది వైసీపీ పతనానికి దారి తీసింది. ఇక, ఇప్పుడు ఇసుక, మద్యం విషయంలో టీడీపీ నేతలు.. జోక్యం చేసుకుంటున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు, విమర్శలు, వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి. వీటిపై పెద్ద ఎత్తున రగడ కూడా చోటుచేసు కుంది.
ఈవ్యవహారం సీఎం చంద్రబాబు వరకు కూడా వెళ్లింది. దీంతో తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్ కావడం .. తగదని అనుకూల మీడియాలోనూ కథనాలు రావడంతో కొందరు వెనక్కి తగ్గినట్టు కనిపించింది. అయి తే.. ఇదేసమయంలో నాయకులు క్షేత్రస్థాయిలో తాము పడుతున్న ఇబ్బందులను కూడా చంద్రబాబుకు తాజాగా వివరించారు. ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుల ద్వారా చంద్రబాబుకు సమాచారం అందించారు.
ఎన్నికలకు ముందు.. గత ఐదేళ్లలో తాము పార్టీ కోసం ఎంతెంత ఖర్చు చేసిందీ విశాఖకు చెందిన ఓ కీలక నాయకుడు జమా పద్దులతో సహా పెద్ద జాబితాతో కూడిన పెన్ డ్రైవ్‌ను చంద్రబాబుకు చేరవేశారు. అదే విధంగా అనంతపురానికి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు కూడా వివరాలను తన వారితో చంద్రబాబు కు పంపించారు. వీటిలో ప్రధానంగా తాము జైళ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. పెట్టిన బెయిల్ ఖర్చులు, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేసిన ధర్నాలకు అయిన డబ్బులు.
ఇవి కాకుండా.. ఎన్నికల సమయంలో పార్టీ నుంచి రూపాయి రాకపోయినా.. తామే అంతా భరించామంటూ .. ఆ లెక్కలు వివరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమ దగ్గర రూపాయి కూడా లేదని.. రోజు వారీ ఖర్చులే లక్షల్లో ఉంటున్నాయని వివరించారు. వీటిపై సీనియర్ నాయకులు ముగ్గురు చంద్రబాబుకు వివరించారు. ఇది నిజమేనని వారు కూడా ధ్రువీకరించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో వారికి కొంత వెసులుబాటు ఇవ్వాలనివారు చంద్రబాబుకు సూచించారు. దీనికి ప్రస్తుతానికి చంద్రబాబు `మౌనం`గా ఉన్నారు. సో.. దీనిని బట్టి.. ఏం చేస్తారో చూడాలి.